AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: చికెన్‌లోని ఈ పార్ట్‌కు ఇంత పవర్ ఉందా..? ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

చికెన్.. అనగానే.. నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు. కర్రీ నుంచి ఫ్రై వరకు.. చట్నీ నుంచి చికెన్ 65 వరకు.. ఎన్నో రకాలుగా చికెన్ ను ఇష్టంగా వండుకుని తింటారు.. అయితే.. చికెన్ తోపాటు.. కోడి లివర్, కందనకాయ, కాళ్లు ఇలా వేటికవే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగిఉన్నాయి.

Chicken: చికెన్‌లోని ఈ పార్ట్‌కు ఇంత పవర్ ఉందా..? ఈ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Chicken Gizzards Recipe
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2026 | 2:30 PM

Share

చికెన్.. అనగానే.. నాన్ వెజ్ ప్రియులు లొట్టలేసుకుంటూ మరి తింటారు. కర్రీ నుంచి ఫ్రై వరకు.. చట్నీ నుంచి చికెన్ 65 వరకు.. ఎన్నో రకాలుగా చికెన్ ను ఇష్టంగా వండుకుని తింటారు.. అయితే.. చికెన్ తోపాటు.. కోడి లివర్, కందనకాయ, కాళ్లు ఇలా వేటికవే ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగిఉన్నాయి. అయితే.. ఆదివారం అనే కాకుండా.. అన్ని వారాల్లో చాలామంది చికెన్ షాపుల ముందు నిలబడి చికెన్ తో పాటు కోడి కందనకాయ (గిజార్డ్), కోడి కాళ్లు వంటి భాగాలను కూడా ప్రత్యేకంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే వీటిని తినడం వల్ల ఎలాంటి లాభాలు, నష్టాలు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు డైటీషియన్లు.. అయితే.. చికెన్ వలే.. కందనకాయలో కూడా ఎన్నో పోషకాలు దాగున్నాయి.. చికెన్ గిజార్డ్స్ (కందనకాయలు) ప్రోటీన్, ఐరన్, విటమిన్ B12 తో నిండిన పోషకమైన ఆహారం. ఇవి తక్కువ కొవ్వును కలిగి ఉండటంతోపాటు.. శక్తిని పెంచడంలో, కండరాల నిర్మాణంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

కోడి కందనకాయ తినడం వల్ల కలిగే… ఆరోగ్య ప్రయోజనాలు, నష్టాలను తెలుసుకుందాం..

చికెన్ గిజార్డ్‌ (కందనకాయ) లో ప్రోటీన్, ఐరన్, జింక్, బి విటమిన్‌లు అధికంగా ఉంటాయి. ఇది కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తికి, రక్తహీనత నివారణకు సహాయపడుతుంది. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మంచిది.

దీనిలో ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇది అలసట, బలహీనతను నివారిస్తుంది. కందనకాయల్లోని జింక్ రోగనిరోధక శక్తి పనితీరుకు, గాయాలు మానడానికి, కణజాల పెరుగుదలకు సహాయపడుతుంది.

అయితే, ఇందులో కొలెస్ట్రాల్, సోడియం అధికంగా ఉంటుంది.. కావున ఎక్కువగా తింటే.. గుండె జబ్బులు, అధిక రక్తపోటుకు దారితీయవచ్చంటున్నారు డైటీషియన్లు…

అంతేకాకుండా.. గిజార్డ్ జీర్ణం కావడానికి కష్టం, సరిగా ఉడకకపోతే సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వల్ల ఆహార విషాహారం (ఫుడ్ పాయిజనింగ్) కలిగించవచ్చని పేర్కొంటున్నారు.

అయితే.. కందనకాయను కర్రీగా.. ఫ్రైగా చేసుకుని తినవచ్చు.. గిజార్డ్‌ను శుభ్రంగా కడిగి, లోపలి పసుపు పొరను తీసివేసి, పూర్తిగా ఉడికించి మితంగా తినడం ముఖ్యం. జీర్ణ సమస్యలు ఉన్నవారు దీనిని నివారించడం మంచిది. అయితే.. దీనిని చికెన్ కర్రీలా, ఫ్రైలా మసాలా దినుసులతో సాధారణంగా చేసుకోవచ్చు..

కందనకాయ కర్రీ, ఫ్రై ఇలా తయారు చేసుకోండి..

కందనకాయలను కడిగి, చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ తర్వాత పాన్‌లో నూనె వేడి చేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. అనంతరం శుభ్రం చేసిన కందనకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ముక్కలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. మధ్యమధ్యలో కలుపుతూ, అడుగు అంటకుండా చూసుకోవాలి. చివర్లో కొత్తిమీర, కరివేపాకు వేస్తే సరిపోతుంది. ఇలా కందనకాయ ఫ్రై చేసుకోవచ్చు.. లేదా కొద్దిగా నీరు పోసి కర్రీ లాగా చేసుకోవచ్చు..

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. డైటీషియన్లు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించి తినడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us