AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోడ్డు పక్కన అమాయకంగా కనిపించిన వ్యక్తి.. మానవత్వంతో లిఫ్టు ఇచ్చిన పాపానికి..!

సాధారణంగా బైక్, కారుపై వెళుతుంటే చాలామంది లిఫ్ట్ అడుగుతుంటారు. ముఖ్యంగా రాత్రి వేళలో ఒంటరిగా ఉన్న వ్యక్తులు లిఫ్ట్ కోసం ఇబ్బంది పడుతుంటారు. మానవత్వం ఉన్న కొందరు లిఫ్ట్ ఇస్తుంటారు. ఆ మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి నల్లగొండ జిల్లాలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

రోడ్డు పక్కన అమాయకంగా కనిపించిన వ్యక్తి.. మానవత్వంతో లిఫ్టు ఇచ్చిన పాపానికి..!
Car Robbery
M Revan Reddy
| Edited By: |

Updated on: Feb 04, 2026 | 2:52 PM

Share

సాధారణంగా బైక్, కారుపై వెళుతుంటే చాలామంది లిఫ్ట్ అడుగుతుంటారు. ముఖ్యంగా రాత్రి వేళలో ఒంటరిగా ఉన్న వ్యక్తులు లిఫ్ట్ కోసం ఇబ్బంది పడుతుంటారు. మానవత్వం ఉన్న కొందరు లిఫ్ట్ ఇస్తుంటారు. ఆ మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

నల్గొండ పట్టణంలోని అబ్బాసియా కాలనీకి చెందిన షేక్ ఇమ్రాన్ అలీ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. క్యాబ్ యజమానిని నల్గొండలో వదిలి తిరిగి రాత్రి హైదరాబాద్ కు బయలుదేరాడు. నార్కట్‌పల్లి వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇమ్రాన్ కారును.. లిఫ్ట్ కావాలంటూ సైగ చేసి ఆపాడు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న అతన్ని చూడగానే.. మానవత్వంతో అయ్యో పాపం.. అనుకున్నాడు. ఎంతో ఆపదలో ఉన్నాడనుకుని ఇమ్రాన్.. కారు ఆపి ఎక్కించుకున్నాడు. పది నిమిషాల్లోనే కారు చిట్యాలకు చేరుకుంది.

ఇంతలోనే వెనుక సీట్లో కూర్చున్న ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో ఒక్కసారిగా ఇమ్రాన్ మెడపై దాడికి ప్రయత్నించాడు. ఇమ్రాన్ దగ్గర ఉన్న ఖరీదైన మొబైల్ ఫోన్, నగదును లాక్కునేందుకు దుండగుడు యత్నించాడు. దీంతో ఇమ్రాన్ తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇమ్రాన్ మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం అవుతున్నా.. ఇమ్రాన్ కారు పక్కకు ఆపి కేకలు వేశాడు. ఇది గమనించిన స్థానికులు.. అక్కడికి చేరుకునేలోపే.. నిందితుడు చీకట్లోకి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఇమ్రాన్ ను అంబులెన్సులో నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇమ్రాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హిందీ మాట్లాడిన నిందితుడు.. బీహార్, ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వ్యక్తిగా పోలీసుల అనుమానిస్తున్నారు. జాతీయ రహదారిపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడు పారిపోయిన పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఇమ్రాన్ పై గతంలో పలు కేసులు ఉండటంతో దారి దోపిడీకి పాల్పడ్డారా..? లేదంటే పాత కక్షలతో ఎవరైనా దాడి చేసి ఉంటారా ?అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాహనదారులకు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హీరోయిన్..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
కూతురు చదువు, పెళ్లికి ఇక నో టెన్షన్.. కేంద్రం తెచ్చిన..
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
మతం నుంచి అరెస్టుల దాకా.. పీవీ సునీల్‌కు కఠిన ప్రశ్నలు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
వేసవి చర్మానికి అమృతం! పెరుగు–కీరదోస ఫేస్ ప్యాక్‌తో సహజమైన మెరుపు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ బీభత్సం ఒకవైపు సెగలు.. మరోవైపు వానలు
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌లో ఇద్దరు తెలుగోళ్లు..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
అప్పుడు స్కూల్లో టీచర్.. ఇప్పుడు పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
సోమవారం సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఖరీదైన నెయిల్‌ పాలిష్‌ కొద్ది రోజులకే ఎండిపోయిందా..? ఇలా చేస్తే
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?
ఆ 11 మంది ఎలా చనిపోయారు? ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీ చూశారా?