బాబోయ్ ఇదేం కలర్‌ అని భయపడుతున్నారా..?  మీకే లాస్‌..

04 February 2026

Jyothi Gadda

బ్లాక్ క్యారెట్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బ్లాక్ క్యారెట్లలో ఆరోగ్యానికి మేలు చేసే ఆంథోసైనిన్ అనే రసాయనం ఉంటుంది.

బ్లాక్‌ క్యారెట్‌ రక్తాన్ని శుద్ధి చేయడంలో, ప్రసరణ మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, ఉబ్బరం, విరేచనాలు తగ్గుతాయి.

ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.  దీని కారణంగా ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది .

అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకం, ఇతర కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నల్ల క్యారెట్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యారెట్లు బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. జలుబు, ఫ్లూ దరి చేరవు.

విటమిన్ సి కంటెంట్ రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. శరీరాన్ని వ్యాధి నుండి రక్షిస్తుంది.

నల్ల క్యారెట్లలో ఆంథోసైనిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

నల్ల క్యారెట్‌ తినటం వల్ల కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, వాటిని దెబ్బతినకుండా రక్షించడంలో సహాయపడుతుంది.  వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుంది.