మీ కుటుంబం వల్లే భారత్ కు ఈ కష్టాలు.. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ట్వీట్ వార్

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతున్నది. ట్విట్టర్ వేధికగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది మోదీ చేతగానితనమే అని రాహుల్ ట్వీట్ చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు తలవంచడమే మోదీ చేసే పని అని రాహుల్ ఘాటుగా స్పందించారు. […]

మీ కుటుంబం వల్లే భారత్ కు ఈ కష్టాలు.. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య ట్వీట్ వార్
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 3:49 PM

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతున్నది. ట్విట్టర్ వేధికగా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది మోదీ చేతగానితనమే అని రాహుల్ ట్వీట్ చేశారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు తలవంచడమే మోదీ చేసే పని అని రాహుల్ ఘాటుగా స్పందించారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అసలు మీ ముత్తాతే (నెహ్రూ) చైనాకు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి స్థానాన్ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇండియాకు రావాల్సిన ఆ స్థానాన్ని మీ ముత్తాత చైనాకు ఇచ్చారు. మీ కుటుంబం చేసిన తప్పులనే ఇప్పుడు భారత్ అనుభవిస్తున్నది. ఉగ్రవాదంపై కచ్చితంగా భారత్ విజయం సాధించి తీరుతుంది. ఆ పనిని మోదీకి వదిలేయండి. మీరు చైనా రాయబారులతో రహస్యంగా సమావేశాలు నిర్వహించుకోండి అంటూ అదే స్థాయిలో రాహుల్ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది.