జేడీ లక్ష్మీ నారాయణ సంచలన నిర్ణయం
అమరావతి: ప్రజా సేవ కోసం ఉన్నతమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్న వ్యక్తి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ. సొంతంగా పార్టీ పెడుతున్నారని, రాజకీయంగా కీలకంగా మారనున్నారని పలు వార్తలొచ్చారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరుతున్నట్టు వినిపించింది. అయితే ఇందుకు ఆయన తెరదించుతూ సంచలన ప్రకటన చేశారు. ఈసారికి తాను ఏ పార్టీకీ మద్దతివ్వడం లేదని తెలిపారు. ఏ పార్టీలోనూ చేరడంలేదని స్పష్టం చేశారు. తటస్తంగానే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. […]

అమరావతి: ప్రజా సేవ కోసం ఉన్నతమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్న వ్యక్తి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ. సొంతంగా పార్టీ పెడుతున్నారని, రాజకీయంగా కీలకంగా మారనున్నారని పలు వార్తలొచ్చారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరుతున్నట్టు వినిపించింది. అయితే ఇందుకు ఆయన తెరదించుతూ సంచలన ప్రకటన చేశారు.
ఈసారికి తాను ఏ పార్టీకీ మద్దతివ్వడం లేదని తెలిపారు. ఏ పార్టీలోనూ చేరడంలేదని స్పష్టం చేశారు. తటస్తంగానే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎన్నికల తర్వాత రాజకీయ ప్రవేశం గురించి ఆలోచిద్దామని, ప్రస్తుతం ప్రజాసేవ ఎన్జీవో కార్యక్రమాల్లో తాను బిజీగా ఉంటానని అన్నారు.



