డేంజర్ బెల్.. ఈ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదు!
Samatha
5 February 2026
ఈ మధ్యకాలంలో చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. రోజు రోజుకు హృదయ సంబంధ వ్యాధులు ఉన్నవారి సంఖ్య పెరుగుతుంది.
గుండె సమస్యలు
అందుకే ఆరోగ్య నిపుణులు తీసుకునే ఆహారం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చిరిస్తున్నారు. కాగా, ఇప్పుడు మనం దాని గురించే తెలుసుకుందాం.
ఆరోగ్య నిపుణులు
ముఖ్యంగా గుండె సమస్యలతో బాధపడే వారు బొప్పాయి తినడం ఆరోగ్యానికి మంచిదేనా ? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.
బొప్పాయి
బొప్పాయి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్
అయితే దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం దీని విషయంలో తప్పకుండా జాగ్రత్త వహిచాలంట.
గుండె సమస్యలు ఉన్నవారు
గుండె సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినడం వలన ఇది హృదయ స్పందన పై ప్రభావం చూపే ప్రమాదం ఉందని, అందుకే ఇది మందులు వాడుతున్న వారు దీనిని తీసుకునే క్రమంలో జాగ్రత్త అవసరం అంట.
హృదయ స్పందన
బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది గుండె సమస్యలకు సంబంధించి మెడిసన్ తీసుకుంటున్నట్లు అయితే ఇది తినడం ప్రమాదకరం, రక్తస్రావాన్ని పెంచే ప్రమాదం ఉన్నదంట.
రక్తస్రావం
అదే విధంగా థైరాయిడ్ , అలెర్జీ సమస్యలతో బాధపడే వారు, గర్భిణీలు బొప్పాయి తినే సమయంలో కూడా తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే వైద్యుడిని సంప్రదించడం అవసరం అని చెబుతున్నారు నిపుణులు.