పార్టీ ఛాన్స్ ఇస్తే నారా లోకేష్‌పై పోటీ చేసి గెలుస్తా

పార్టీ అధినేత జగన్ ఛాన్స్ ఇస్తే మంగళగిరిలో మంత్రి నారా లోకేష్‌పై పోటీ చేసి గెలుస్తానని అన్నారు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు. ఇటీవలే వైసీపీ నార్నె శ్రీనివాస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో చేరాలనేది తన వ్యక్తిగత నిర్నయమని.. దీనితో తారక్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చంద్రబాబును తాను దగ్గర నుంచి చూశానని.. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య చాలా తేడా ఉందని […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:33 pm, Thu, 14 March 19
పార్టీ ఛాన్స్ ఇస్తే నారా లోకేష్‌పై పోటీ చేసి గెలుస్తా

పార్టీ అధినేత జగన్ ఛాన్స్ ఇస్తే మంగళగిరిలో మంత్రి నారా లోకేష్‌పై పోటీ చేసి గెలుస్తానని అన్నారు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు. ఇటీవలే వైసీపీ నార్నె శ్రీనివాస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో చేరాలనేది తన వ్యక్తిగత నిర్నయమని.. దీనితో తారక్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చంద్రబాబును తాను దగ్గర నుంచి చూశానని.. జగన్‌కు, చంద్రబాబుకు మధ్య చాలా తేడా ఉందని అన్నారు. ఏపీ కోసం చంద్రబాబు చేసిందేమీ లేదని.. ప్రజల కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో చేశారని అన్నారు శ్రీనివాసరావు. అందుకే నేను జగన్‌కు మద్దతిస్తూ వైసీపీలో చేరానని తెలిపారు.