దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు గ్లాసుడు గోల్డెన్ మిల్క్ తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది
TV9 Telugu
గోల్డెన్‌మిల్క్‌ను ఇలా తయారుచేసుకోవచ్చు. గ్లాసుడు పాలను స్టవ్ మీద పెట్టి చెంచాడు పసుపు, చెంచాడు తేనె, చిటికెడు మిరియాల పొడి, అల్లం, దాల్చిన చెక్క వేసి బాగా కలిపి తక్కువ మంట మీద కాసేపు మరగనివ్వాలి
TV9 Telugu
వీటిని తీసుకోవడం వల్ల తెల్లవారేసరికి తేడా మీకే తెలుస్తుంది. అందుకే ఆరోగ్యానికి పసుపు పాలు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు
అయితే చాలామంది నిద్రపోయే ముందు పసుపు పాలు తాగుతుంటారు. అలా చేయడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
TV9 Telugu
ఎందుకంటే అధిక కేలరీలు ఉండే హల్దీ దూద్ తాగి పడుకుంటే జీర్ణవ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుందట. పాలు తాగిన వెంటనే పడుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి
TV9 Telugu
రాత్రి భోజనం కడుపు నిండుగా తిన్నతర్వాత పాలు తాగడం వల్ల ఉబ్బరం పెరుగుతుంది. వీలైతే రాత్రి భోజనానికి ముందు పాలు తాగడం మంచిది
TV9 Telugu
దీనివల్ల ఆహారాన్ని కూడా మితంగా తీసుకున్నవాళ్లమవుతాం. భోజనం తర్వాత వెంటనే పాలు తాగకుండా కనీసం ఒకటి రెండు గంటల తర్వాత వెచ్చని పసుపు పాలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇందులో చక్కెర వేయకూడదు