30 రోజులు చక్కెర తినడం మానేస్తే ఇన్ని మార్పులా..?
05 February 2026
TV9 Telugu
TV9 Telugu
ఉదయం నిద్రలేచింది మొదలు సాయంత్రం నిద్రించే వరకు ఏదో ఒక రూపంలో చక్కెరను తీసుకుంటూనే ఉంటాం. టీ, కాఫీ, జ్యూస్, స్వీట్స్, కుక్కీస్ ఇలా ఏదో ఒక రూపంలో చక్కెర మన శరీరంలోకి వెళ్తూనే ఉంటుంది
TV9 Telugu
అయితే చక్కెరను తీసుకోవడం 30 రోజుల పాటు మానేయడం వల్ల ఎన్నో శారీరక, మానసిక మార్పులను గమనించవచ్చని వైద్యులు చెబుతున్నారు
TV9 Telugu
చక్కెర మానేస్తే మొదట్లో చిరాకు, అలసట, ఆందోళన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. మెదడు చక్కెర అందించే డోపమైన్ హిట్ ను కోల్పోవడం వల్ల ఇలా జరుగుతుంది
TV9 Telugu
శరీరం నెమ్మదిగా చక్కెరకు దూరం అయ్యే కొద్దీ ఈ కోరికలు తగ్గుతూ వస్తాయి. అయితే డిటాక్స్ ట్రెండ్ కంటే ఎక్కువగా చక్కెరను తీసుకోకపోవడం వల్ల మన శరీరానికి కలిగే మేలే ఎక్కువ ఉంటుంది
TV9 Telugu
ఇలా చక్కెర మానేయడం వల్ల క్రమంగా రెండవ వారం నాటికి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ మరింత సమర్థవంతంగా నిర్వహించబడుతుంది
TV9 Telugu
ఇన్సులిన్ స్థాయిలు తగ్గడంతో శరీరం నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం ప్రారంభిస్తుంది. తద్వారా శరీర బరువు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో కూడా అదుపులో ఉంటుంది
TV9 Telugu
ఇక మూడవ వారం కూడా చక్కెరను తీసుకోవడం మానేయడం వల్ల మనం దీర్ఘకాలిక ప్రయోజనాలనుగమనించవచ్చు. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది
TV9 Telugu
దద్దుర్లు, మంట, మొటిమలు, పగుళ్లు వంటివి తగ్గుతాయి. అకాల వృద్దాప్యం రాకుండా ఉంటుంది. రక్తంలో చక్కెర క్రాష్ లు తగ్గడం వల్ల మనం మరింత స్థిరంగా దృష్టి కేంద్రీకరించవచ్చు