నాకు సీటివ్వకపోతే పక్కచూపు చూస్తా: రాయపాటి

అమరావతి: చంద్రబాబుపై నమ్మకం ఉంది. నాకు పార్టీ టికెట్ ఇస్తారని అనుకుంటున్నా. టికెట్ గురించి అడిగినప్పుడు కొంచెం టైం కావాలన్నారు, అంతేగానీ టికెట్ ఇవ్వడంలేదని చెప్పలేదని టీడీపీ నేత, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రాయపాటి అనుచరులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని నిరసన తెలుపుతున్నారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు కూడా రాయపాటి సిద్ధమయ్యారు. పార్టీ తనకు టికెట్ కేటాయించకపోతే పక్క చూపు చూస్తానని అన్నారు. వైసీపీలోకి […]

  • Vijay K
  • Publish Date - 3:13 pm, Thu, 14 March 19
నాకు సీటివ్వకపోతే పక్కచూపు చూస్తా: రాయపాటి

అమరావతి: చంద్రబాబుపై నమ్మకం ఉంది. నాకు పార్టీ టికెట్ ఇస్తారని అనుకుంటున్నా. టికెట్ గురించి అడిగినప్పుడు కొంచెం టైం కావాలన్నారు, అంతేగానీ టికెట్ ఇవ్వడంలేదని చెప్పలేదని టీడీపీ నేత, నరసారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

రాయపాటి అనుచరులు, కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుని నిరసన తెలుపుతున్నారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు కూడా రాయపాటి సిద్ధమయ్యారు. పార్టీ తనకు టికెట్ కేటాయించకపోతే పక్క చూపు చూస్తానని అన్నారు. వైసీపీలోకి రావాలని మా సన్నిహితులు కోరుతున్నారని రాయపాటి చెప్పడంతో స్థానికంగా పొలిటికల్ హీట్ పెరిగింది.

భవిష్యత్తు కార్యాచరణపై కుమారుడు రంగారావు, సోదరుడు శ్రీనివాస్‌తో రాయపాటి సమావేశమై చర్చలు జరిపారు.