అందరికీ నచ్చాలంటే ఇవి మీలో ఉండాలి.. మరి, ఉన్నాయో?లేవో టెస్ట్ చేసుకోండి

Prasanna Yadla

05 February 2026

Pic credit - Pixabay

చాలా మంది అందరికీ నచ్చాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ, ఈ రోజుల్లో అవసరాలకు మాట్లాడే బంధాలే ఎక్కువ ఉన్నాయి. 

అందరికీ నచ్చడం 

మరి, ఇలా నడుస్తున్న కాలంలో మీరు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. లేదంటే, మీరు చాలా కోల్పోవాల్సి ఉంటుంది. 

జాగ్రత్తగా ఉండాలి

అయితే, ఎవరితోనైనా మరి, ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఇలా ఉండండి. మీరు అందరికీ నచ్చేస్తారు.

ఇలా ఉంటే అందరికీ నచ్చేస్తారు.

ఇచ్చిన మాటను ఎంత కష్టమైన నిలబెట్టుకోవాలి. అవసరాల కోసం, పరిస్థితులను బట్టి మాట మార్చకూడదు. అప్పుడు మీకు, మీ  మాటకు విలవే లేకుండా పోతుంది. 

మాట నిలబెట్టుకోవడం

తప్పు జరిగినప్పుడు మీరెలా మాట్లాడుతున్నారనేది ముఖ్యమైన పాయింట్. అదొక్కటి చాలు మీరేంటో అని చెప్పడానికి. మూడో వ్యక్తి మాటలు విని మీతో ఉండే వారి మీద ఎప్పుడు తప్పును నెట్టకూడదు. 

చేసిన తప్పులు ఒప్పుకోవాలి

ఒక వ్యక్తిని తప్పుగా అర్ధం చేసుకునే ముందు ఆ మనిషి మీకు గతంలో ఎంత సాయం చేశారన్నది తెలుసుకోవాలి. అప్పుడే మీకు ఆ గౌరవం ఉన్నట్లు. అలా కాకుండా చేసింది మొత్తం మర్చిపోయి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించకూడదు. 

గౌరవం

మీకు ఇష్టమైన వాళ్ళు లేదా మీ ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు ఒక్కోసారి సాయం చేయమని కోరతారు. ఆ సమయంలో కొన్ని సార్లు నో  చెప్పడం కూడా అలవాటు చేసుకోండి. దీని వలన మీ విలువ పెరుగుతుంది.

కొన్ని సార్లు నో చెప్పాలి

అందరూ కలిసి పని చేసినప్పుడు ఎవర్ని తక్కువ చేయకుండా ఫీడ్ బ్యాక్ కరెక్ట్ గా ఇవ్వాలి. ఒకర్ని హర్ట్ చేసేలా మీ మాటలు ఉండకూడదు.

ఫీడ్ బ్యాక్