AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్.. కమలం గూటికి చేరిన సోనియా మాజీ కార్యద‌ర్శి

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు టామ్ వడక్కన్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు కూడా కలిశారు. ‘దేశంలో టెర్రరిస్టులు దాడి చేస్తే.. దీనిపై మా (కాంగ్రెస్) పార్టీ మాట్లాడిన తీరు నన్ను చాలా బాధించింది. ఓ రాజకీయ పార్టీ […]

కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్.. కమలం గూటికి చేరిన సోనియా మాజీ కార్యద‌ర్శి
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 14, 2019 | 4:12 PM

Share

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు టామ్ వడక్కన్ బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు కూడా కలిశారు. ‘దేశంలో టెర్రరిస్టులు దాడి చేస్తే.. దీనిపై మా (కాంగ్రెస్) పార్టీ మాట్లాడిన తీరు నన్ను చాలా బాధించింది. ఓ రాజకీయ పార్టీ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే, నాకు ఆ పార్టీని వీడడం తప్ప మరో ఆప్షన్ కనిపించలేదు.’ అని పుల్వామా ఉగ్రదాడిని ఉద్దేశించిన టామ్ వడక్కన్ వ్యాఖ్యానించారు. మన సాయుధ బలగాల సమగ్రతను అనుమానించడం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని, అందుకే 20 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు టామ్ వెల్లడించారు. టామ్ వడక్కన్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఏఐసీసీ కార్యదర్శిగానూ పనిచేశారు. టామ్ వడక్కన్ కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్లుగా సేవలు అందించారు. ఎన్నికల సమయంలో ఆయన పార్టీ మారడం కాంగ్రెస్‌కు మానసికంగా దెబ్బే అని పార్టీ నేతలు చెబుతున్నారు.

Follow Us
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
నువ్వేది ఆలోచిస్తే అదే జరుగుతుంది.. దీని వెనకున్న అసలైన సైన్స్
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?
రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?