పీపీఏల విషయంలో సీఎం జగన్ అందుకే వెనక్కి తగ్గారా?

పీపీఏల విషయంలో సీఎం జగన్ అందుకే వెనక్కి తగ్గారా?
Political Risk Spikes In Andhra As Jagan Government Questions PPA’s

పీపీఏల విషయంలో ఏపీ సర్కార్ వెనక్కు తగ్గింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షిస్తామని గతంలో ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. వాటి జోలికి వెళ్లబోమని కేంద్రానికి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో జగన్ సర్కార్‌కు కేంద్రం ఇటీవల కాస్త సీరియస్‌గా లేఖ రాసిన విషయం తెలిసిందే. గతంలో పీఎవోం రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రస్టేజ్‌గా తీసుకుంది. తాజాగా […]

Ram Naramaneni

|

Sep 12, 2019 | 4:19 AM

పీపీఏల విషయంలో ఏపీ సర్కార్ వెనక్కు తగ్గింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షిస్తామని గతంలో ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. వాటి జోలికి వెళ్లబోమని కేంద్రానికి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో జగన్ సర్కార్‌కు కేంద్రం ఇటీవల కాస్త సీరియస్‌గా లేఖ రాసిన విషయం తెలిసిందే. గతంలో పీఎవోం రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రస్టేజ్‌గా తీసుకుంది. తాజాగా లేఖ రాసి రెండు రోజుల్లోగా తగిన సమాధానం ఇవ్వాలని సూచించింది.

దీంతో ఏపీ ప్రభుత్వం స్పందించక తప్పలేదు.  ఇప్పటికే అమలులో ఉన్న పాత పీపీఏల జోలికి వెళ్లబోమని, ఇంకా ఖరారుకాని ఒప్పందాల మీద మాత్రమే దృష్టి సారిస్తామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా ఏపీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అయితే, అందులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీపీఏలపై సమీక్ష చేస్తామని ప్రకటించారు. దీనిపై కొన్ని కంపెనీలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. కడప, అనంత జిల్లాకు చెందిన ఎస్‌బీఈ, అయిన, స్పింగ్ కంపెనీల ఏపీ సర్కార్ నిర్ణయాన్ని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ పీపీఏ ఒప్పందాలను రద్దు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63, కేంద్రం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది సరికాదని వ్యాఖ్యానించింది.

ఏపీ ప్రభుత్వ వాదన:

గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టులు అయితే తీసుకున్నారు కానీ పనులు మాత్రం ఆశించినంత మేర పూర్తి చేయలేకపోయారని, చాలా పనుల్లో మొబలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని మరీ పనులు చేయకుండా తీవ్ర జాప్యం చేశారని, దీనిపై గత టీడీపీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని వైసీపీ ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ నివేదించినట్లు సమాచారం. వాస్తవాననికి ప్రాజెక్టు నిర్మాణ పనుల కాంట్రాక్టులు దక్కించుకన్న ఏజెన్సీలు 24 నెలల్లో తమకు అప్పగించిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఒప్పందం ముగిసినా వారు పనులు పూర్తి చేయలేకపోయారని తెలిసింది. అదే సమయంలో పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు చెల్లింపులను కూడా పెంచాలని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని నివేదిక సదరు కంపెనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందా:

వాస్తవానికి పీపీఏల విషయంలో జగన్ సర్కార్ మొదట్నుంచి దూకుడుగానే వ్యవహరిస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం వాటి జోటిలి పదే..పదే హెచ్చరిస్తూ వస్తుంది. ఏపీ ప్రభుత్వం వారి సూచనలను బేఖాతరు చెయ్యడంతో..కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా రియాక్ట్ అయ్యింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో కేంద్రం నుంచి ఆర్థిక తోడ్పాడు ఎంతో అవసరం. పూర్తి మెజార్టీతో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంతో చెలిమి చేసి..నిధులు తెచ్చుకోవాలి తప్ప..కొట్లాట పెట్టుకుంటే ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ విషయంలో సీఎం జగన్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. మరి జగన్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం శాంతిస్తుందో, లేదో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu