టార్గెట్ కడప..అందుకే మాజీ మంత్రి చేరికకు బీజేపీ గ్రీన్ సిగ్నల్!

టార్గెట్ కడప..అందుకే మాజీ మంత్రి చేరికకు బీజేపీ గ్రీన్ సిగ్నల్!

గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం అనంతరం  ఆ పార్టీ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి ఓ రేంజ్‌లో జంపింగ్స్ జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లు సర్దుమనిగినట్టు అనింపిచినా..తాజాగా బడా నాయకులు టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఆ లిస్ట్‌లోకి చేరబోతున్నారు కడప జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. గురువారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఆదినారాయణ రెడ్డి  ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతో […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Sep 12, 2019 | 8:41 PM

గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం అనంతరం  ఆ పార్టీ నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి ఓ రేంజ్‌లో జంపింగ్స్ జరిగాయి. ఆ తర్వాత కొన్నాళ్లు సర్దుమనిగినట్టు అనింపిచినా..తాజాగా బడా నాయకులు టీడీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఆ లిస్ట్‌లోకి చేరబోతున్నారు కడప జిల్లా సీనియర్ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. గురువారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఆదినారాయణ రెడ్డి  ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనతో పాటూ మరికొందరు ముఖ్య కార్యకర్తలు కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. తాజాగా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పార్టీలో చేరేందుకు హస్తినకు వెళ్లారు. ఆదినారాయణ రెడ్డి గత ఎన్నికల్లో కడప లోక్‌సభ అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్ హయాంలో 2004 నుంచి 2009 వరకు జమ్మమలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి.. 2014లో మళ్లీ జమ్మలమడుగు నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత అధినేత జగన్‌తో విభేదాలతో ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు. తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు రామసుబ్బారెడ్డికి కేటాయించడంతో.. ఆదినారాయణరెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాల్సి వచ్చింది.

కారణం అదేనా:

2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలిచిన ఆదినారాయణ రెడ్డి..ఆ తర్వాత టీడీపీ చేరేటప్పుడు, చేరాక జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విస్తరణలో చంద్రబాబు మంత్రి పదవి కేటాయించడంతో…ఇక వైసీపీ అధినేతపై ఒంటికాలితో విరుచుకుపడ్డారు. సమయం దొరికినప్పుడల్లా ఆయనను వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఊహించని కామెంట్స్ చేశారు. కాకపోతే గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. జగన్ బంపర్ మెజార్టీతో విజయం సాధించి..సీఎం సీట్లో కూర్చున్నారు. ఇక ప్రస్తుత ప్రభుత్వంతోొ ఇబ్బందులు తప్పవని భావించిన ఆదినారాయణ రెడ్డి  చాలాకాలం క్రితమే బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ హైకమాండ్ నుంచి సిగ్నల్స్ వచ్చేవరకు ఎదురుచూశారు. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి ద్వారా పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే, అది సీఎం జగన్ సొంత జిల్లా కావడంతో అక్కడ బీజేపీని దృఢపరచడం అంత ఈజీ కాదని భావించి ఆదినారాయణరెడ్డితో పాటు మరికొందరు టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు పార్టీ పెద్దలు వ్యూహరచన చేసినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఇటీవలే చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి సుమారు గంటసేపు భేటీ అయ్యారు. ఆ భేటీలో.. జమ్మలమడుగులో తన అనుచరులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో బీజేపీలో చేరడమే ప్రత్యామ్నాయం అని ఆది నారాయణ రెడ్డి చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. ఆసక్తికర విషయం  ఏమిటంటే.. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో ఆదినారాయణరెడ్డి, సీఎం రమేష్‌కి మధ్య సఖ్యత లేదు. చివరకు మళ్లీ ఈ ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో అని కడప జిల్లా వాసులు చర్చించుకుంటున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu