AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగాల్ లో మాదే ప్రభుత్వం, ముఖ్యమంత్రి పదవి మాదే, బీజేపీ నేత తేజస్వి సూర్య

బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మే 3 న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థే ఉంటారని ఈ పార్టీ నేత తేజస్వి సూర్య అన్నారు. ఆ రాష్ట్రంలో సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ....

బెంగాల్ లో మాదే ప్రభుత్వం,  ముఖ్యమంత్రి పదవి మాదే, బీజేపీ నేత తేజస్వి సూర్య
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 04, 2021 | 6:07 PM

Share

బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, మే 3 న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థే ఉంటారని ఈ పార్టీ నేత తేజస్వి సూర్య అన్నారు. ఆ రాష్ట్రంలో సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పదవి నుంచి దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఇక మా పార్టీ అధికారంలో ఉంటే అక్కడ రక్తపాతం, రాజకీయ హత్యలు ఉండవన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ని ఇంటికి పంపడం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్.. తాము ఐదేళ్ళక్రితమే బెంగాల్ ఎన్నికల్లో విజయం కోసం కార్యాచరణ రూపొందించామని తెలిపారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్  ఓటమి ఇక  ఖాయమన్నారు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో బీజేపీ 18 సీట్లను గెలుచుకుందని,  ఈ అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని దిలీప్ ఘోష్ అన్నారు.

అటు-బెంగాల్ లో ఈ సారి త్రిముఖ పోటీ జరగనుంది. బీజేపీ, టీఎంసీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంటున్నారు. ఏమైనా బీజేపీ, టీఎంసీ హోరాహోరీగా పోరాడనున్నాయి.కాగా- ఈ ఎన్నికల్లో మమతనేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కి తాము మద్దతునిస్తున్నట్టు ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ప్రకటించగా.. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా మా సపోర్ట్ మీకే అని స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఈ ప్రకటన చేయడం తృణమూల్ కాంగ్రెస్ కి ఒక విధంగా వరమే అంటున్నారు. బీజేపీని ఎలాగైనా ఓడించేందుకు ఈ మూడు పార్టీలు చేతులు కలపడం విశేషం. 2024 లో జరగనున్న లోక్ సభ ఎన్నికల ముందే ఇలా భావ సారూప్యం గల పార్టీలు ఒకదానికొకటి మద్దతు ప్రకటించుకోవడం వల్ల తృతీయ కూటమి ఏర్పాటుకు అది దారి తీయవచ్చునని అంటున్నారు. అయితే ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా కరిష్మా కూడా బీజేపీకి ప్లస్ పాయింట్ కానుందన్న విషయం కూడా విస్మరించరాదని పరిశీలకులు పేర్కొంటున్నారు. వీరి కరిష్మాను ఎదుర్కొని టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ ఏ విధంగా సాగుతాయన్నది చూడాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

రాంగ్ రూట్‏లో వచ్చిన ‘మహానటి’ హీరో.. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మందలించిన పోలీస్.. నెట్టింట్లో వీడియో వైరల్..

కరాచీ బేకరీని క్లోజ్ చేసిన యాజమాన్యం.. క్రెడిట్ మాదే అంటున్న అధికార పార్టీ