డ్రగ్స్ కేసులో బెంగాల్ బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి పోలీస్ కస్టడీ 18 వరకు పొడిగింపు

డ్రగ్స్ కేసులో బెంగాల్ బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి, ఇతర నిందితుల పోలీస్ కస్టడీని ఈ నెల 18 వరకు పొడిగించారు. ఈ మేరకు కోల్ కతా లోని స్థానిక కోర్టు ఆదేశించింది.  గత నెలలో 100 గ్రాముల కొకైన్ ని తన కారులో.....

డ్రగ్స్ కేసులో బెంగాల్ బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి పోలీస్ కస్టడీ 18 వరకు పొడిగింపు
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Mar 04, 2021 | 6:47 PM

డ్రగ్స్ కేసులో బెంగాల్ బీజేపీ యువమోర్చా నేత పమేలా గోస్వామి, ఇతర నిందితుల పోలీస్ కస్టడీని ఈ నెల 18 వరకు పొడిగించారు. ఈ మేరకు కోల్ కతా లోని స్థానిక కోర్టు ఆదేశించింది.  గత నెలలో 100 గ్రాముల కొకైన్ ని తన కారులో తీసుకుని వెళ్తూ పమేలా గోస్వామి పోలీసులకు పట్టుబడింది. అయితే బీజేపీ నేత రాకేష్ సింగ్ తనను ఈ కేసులో  ఇరికించారని, ఆయన అనుచరుడొకరు తన పర్సులో ఈ కొకైన్ ని ఉంచాడని  పమేలా ఆరోపించింది. రాకేష్ కోర్కెను తను తిరస్కరించినందునే ఆయన తనను తీవ్రంగా వేధించాడని, ఒక సందర్భంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు తనమీద కక్ష గట్టాడని ఆమె కోర్టులో పేర్కొన్న సంగతి విదితమే. తనను ఈ కేసులో కుట్ర పూరితంగా ఇరికించారని పదేపదే తెలిపింది. అటు-గతనెల 23 న రాకేష్ సింగ్  కోల్ కతా నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పోలీసులు దారి కాచి ఆయనను అరెస్టు చేశారు. అయితే పార్టీలో తాను ఎదగడం చూసి  పమేలా గోస్వామి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆయన ఆమెపై ప్రత్యారోపణ చేశాడు. కొకైన్ విషయం తనకేమీ తెలియదన్నారు.

ఇలా ఉండగా ఈ కేసులో కోల్ కతా లోని న్యూ అలీపూర్ స్టేషన్ పోలీసులపై నగర  డిటెక్టివ్ పోలీసులు దృష్టి పెట్టారు. పమేలా గోస్వామి వద్ద ఈ కొకైన్ ఉందన్న సమాచారం వారికి ఎలా తెలిసిందని, ఒక్కుమ్మడిగా పెద్ద సంఖ్యలో వారు ఆమె ప్రయాణించిన కేఫ్ వద్దకు ఎలా చేరుకున్నారని ఈ డిటెక్టివ్ ల బృందం ఆరా తీస్తోంది.  అలాగే పమేలా పర్సులో ఈ డ్రగ్ పెట్టాడని అనుమానిస్తున్న అమృత్ సింగ్ అనే వ్యక్తి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. గత ఏడాది నవంబరులో  నగరానికి వఛ్చిన ఇతడు ఒకచోట ఉండకుండా మకాం మారుస్తూ వచ్చాడని వారు తెలిపారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Paypal: ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ‘పేపాల్’ నుంచి 1000 మందికి అవకాశం.. మిస్ కాకండి..

షర్మిల కొత్త పార్టీపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్‌.. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏమన్నారంటే..