Vaccination: వ్యాక్సిన్ కొరత తో 900 టీకా కేంద్రాలను మూసివేసిన ఒడిశా ప్రభుత్వం..సరఫరాలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ!

కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా వేగంగా సాగుతోంది. అయితే, ఈ సమయంలో వ్యాక్సిన్ కొరత కొన్ని రాష్ట్రాలను వేధిస్తోంది.

Vaccination: వ్యాక్సిన్ కొరత తో 900 టీకా కేంద్రాలను మూసివేసిన ఒడిశా ప్రభుత్వం..సరఫరాలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపణ!
Vaccination
Follow us
KVD Varma

|

Updated on: Apr 12, 2021 | 4:38 PM

Vaccination: కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా వేగంగా సాగుతోంది. అయితే, ఈ సమయంలో వ్యాక్సిన్ కొరత కొన్ని రాష్ట్రాలను వేధిస్తోంది. అనేక రాష్ట్రాలు తమ వద్ద టీకాలు నిండుకున్నాయనీ.. వెంటనే వ్యాక్సిన్ లు అందుబాటులోకి రాకపోతే కనుక టీకా కేంద్రాలు మూతపడతాయనీ కేంద్ర ప్రభుత్వానికి చెబుతూ వస్తున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ టీకా నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని చెబుతూ వస్తోంది. కానీ, ఒడిశాలో మాత్రం ఇప్పటికే టీకాల కొరత కారణంగా 900 కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్లను మూసివేసినట్టు అక్కడి బీజేడీ ప్రభుత్వం చెబుతోంది. కొన్ని రాష్ట్రాలకు టీకాలను సరఫరా చేయడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ ఒడిశా ప్రభుత్వం ఆరోపిస్తోంది.

ఒడిశాలో మొత్తం 1400 వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 579 కేంద్రాల్లోనే టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు వెంటనే కొన్ని వ్యాక్సిన్లు అందకపోతే మరికొన్ని టీకా కేంద్రాల్లో పంపిణీ ఆగిపోతుంది అనై ఒడిశా కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ బీజయ్ పాణిగ్రాహి చెబుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో టీకాలు పంపిణీ చేయాలని తలపెట్టిన ‘టీకా ఉత్సవ్’ కార్యక్రమానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితి అడ్డంకిగా మారుతుందని ఆయన చెప్పారు. ఇక కోవిడ్ టీకా పంపిణీలో కేంద్ర ప్రభుత్వం రాజధర్మం పాటించటం లేదని ఒడిశా కార్మికశాఖ మంత్రి సుశాంత్ సింగ్ ఆరోపించారు. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శిస్తున్నారు. అందులోనూ ఒడిశా రాష్ట్రంపై మరింత వివక్ష చూపుతోందంటూ తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రానికి ఇప్పటి వరకూ మొత్తం 42 లక్షల డోసులు అందాయన్నారు. వాటిలో 40 లక్షలు పంపిణీ పూర్తి అయిందని ఆయన చెప్పారు. ఈ వ్యాఖ్యలను బీజీపీ తప్పు పడుతోంది. కేవలం ఒడిశా మాత్రమే కాకుండా మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా టీకా కొరతపై ఇప్పటికే కేంద్రానికి తమ విజ్ఞప్తి చేశాయి. ఆయా రాష్ట్రాలు విదేశాలకు వ్యాక్సిన్ సరఫరా తగ్గించి దేశీయంగా తమకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి.

అయితే, మరోవైపు కేంద్ర మంత్రులు మాత్రం దేశంలో ఎక్కడ టీకా కొరత లేదని చెబుతూ వస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్యలో కోల్డ్ వార్ మొదలైన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదకర తరుణంలో వ్యాక్సిన్ విషయంలో రాజకీయాలు ఏమిటని ప్రజలు అనుకుంటున్నారు.

Also Read: Covid-19 News: దేశంలో కరోనా గ్రాఫ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుసా? వారం రోజుల వ్యవధిలోనే…

Sputnik Vaccine: భారతీయులకు శుభవార్త.. దేశంలో అందుబాటులోకి మరో వ్యాక్సిన్..