AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీపై కవిత వివాదాస్పద వ్యాఖ్యలు!

సార్వత్రిక ఎన్నికల వేళ పసుపు బోర్డు ఏర్పాటు అంశం ఎన్నికల ప్రణాళికలో పెడతామన్న భారతీయ జనతా పార్టీ.. ఆ అంశాన్ని మేనిఫెస్టోలో ఎక్కడా పేర్కొనలేదని నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. దీంతో భాజపా భారతీయ ఝూట్‌ పార్టీ అని మరోసారి నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుల వృత్తులకు భారీగా నిధులు కేటాయించి ఆదుకుంటున్నామని కవిత అన్నారు. ఎర్రజొన్న రైతులకు […]

బీజేపీపై కవిత వివాదాస్పద వ్యాఖ్యలు!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 08, 2019 | 9:04 PM

Share

సార్వత్రిక ఎన్నికల వేళ పసుపు బోర్డు ఏర్పాటు అంశం ఎన్నికల ప్రణాళికలో పెడతామన్న భారతీయ జనతా పార్టీ.. ఆ అంశాన్ని మేనిఫెస్టోలో ఎక్కడా పేర్కొనలేదని నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. దీంతో భాజపా భారతీయ ఝూట్‌ పార్టీ అని మరోసారి నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ జిల్లా నందిపేటలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుల వృత్తులకు భారీగా నిధులు కేటాయించి ఆదుకుంటున్నామని కవిత అన్నారు. ఎర్రజొన్న రైతులకు బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తున్నామని, మే 1 నుంచి ఆసరా పెన్షన్లు రూ.2016 ఇస్తామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఉచితంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తున్నామని పేర్కొన్నారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వాళ్లకు రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు.