ఇవాళ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో అభ్యర్థులెవరో ఇవాళ తేలిపోతుంది. 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈసాటి సిట్టింగ్ అభ్యర్థుల్లో కొందరికి నిరాశే ఎదురుకానుంది. కొత్తవారికి టికెట్లు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. మహబూబాబాద్, ఖమ్మం, పాలమూరులో సిట్టింగ్ అభ్యర్థులను మార్చుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు పార్టీ నుంచి నిష్క్రమించిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి స్థానంలో చేవెళ్ల టికెట్ ఎవరికి కేటాయిస్తారనే అంశం హాట్ టాపిక్‌గా […]

టీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో అభ్యర్థులెవరో ఇవాళ తేలిపోతుంది. 16 సీట్లలో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు.
ఈసాటి సిట్టింగ్ అభ్యర్థుల్లో కొందరికి నిరాశే ఎదురుకానుంది. కొత్తవారికి టికెట్లు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. మహబూబాబాద్, ఖమ్మం, పాలమూరులో సిట్టింగ్ అభ్యర్థులను మార్చుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు పార్టీ నుంచి నిష్క్రమించిన ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి స్థానంలో చేవెళ్ల టికెట్ ఎవరికి కేటాయిస్తారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
కరీంనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారసభలో వినోద్‌ను గెలిపించాలని కార్యకర్తలు, ఓటర్లకు పిలుపునిచ్చారు కేసీఆర్. దీంతో.. కరీంనగర్ నుంచి వినోద్ పోటీ చేస్తారనే విషయం తేలిపోయింది. ఇక మిగిలిన 15 స్థానాల్లో ఎవరికి సీట్లు కేటాయిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.