ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్టు అన్న విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలే రాజకీయ దుమారం రేపుతున్నాయి. సీఐఐ సదస్సులో చర్చ సందర్భంగా పీవీపీ ఐదు నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రత్యేక హోదాపై చాలా సార్లు చర్చించాం.. ప్రస్తుతం ప్రత్యేక హోదాపై చర్చ అనవసరం అన్నారు. స్పెషల్ స్టేటస్ ఒక బోరింగ్ సబ్జెక్ట్.. దానిపై నేను ఎలాంటి కామెంట్ చేయన్నారు. స్పెషల్ స్టేటస్ బోరింగ్ సబ్జెక్ట్ అన్న పీవీపీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతున్నాయి.
పీవీపీ వ్యాఖ్యలపై విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని ఘాటుగా రియాక్టయ్యారు. పీవీపీ అంతర్జాతీయ స్కామ్‌స్టర్ అని ఆరోపించారు కేశినేని. ఆయన సుప్రీంకోర్టు బెయిల్ మీద ఉన్నారని.. జగన్ డబ్బును విదేశాల్లో దాచింది పీవీపీయేనని కేశినేని ఆరోపించారు.