మా మద్దతు కాంగ్రెస్‌కే- మందకృష్ణ మాదిగ

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఎమ్మార్మీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎన్నికల్లో తమ మద్దతు గురించి ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ స్పష్టమైన హామీ ఇచ్చిందని.. రాహుల్ ప్రధానైతేనే వర్గీకరణ సమస్య పరిష్కారం జరుగుతుందని ఆయన అన్నారు.  తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ కాకుండా మిగిలిన 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామన్నారు. సికింద్రాబాద్‌లో తమ శ్రేయాభిలాషి […]

మా మద్దతు కాంగ్రెస్‌కే- మందకృష్ణ మాదిగ
Follow us

|

Updated on: Apr 01, 2019 | 1:14 PM

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ఎమ్మార్మీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఎన్నికల్లో తమ మద్దతు గురించి ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్‌ స్పష్టమైన హామీ ఇచ్చిందని.. రాహుల్ ప్రధానైతేనే వర్గీకరణ సమస్య పరిష్కారం జరుగుతుందని ఆయన అన్నారు.  తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ కాకుండా మిగిలిన 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామన్నారు. సికింద్రాబాద్‌లో తమ శ్రేయాభిలాషి కిషన్‌రెడ్డికి మద్దతు ఇస్తున్నామని.. వ్యక్తిగతంగా రెండు దశాబ్దాలుగా తమకు ఎంతో సపోర్ట్‌ చేశారని గుర్తు చేశారు. ఇది బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు కాదని స్పష్టం చేశారు.

నాగర్ కర్నూల్‌లో ఎవరికి మద్దతు ఇవ్వాలో అక్కడివారితో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాగర్‌కర్నూల్‌లో మల్లు రవిని ఓడించడమే తమ టార్గెట్‌ అని చెప్పారు. భువనగిరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరిన మందకృష్ణ మాదిగ.. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిదని అభిప్రాయపడ్డారు.