రసవత్తరంగా మారిన హుజూర్ నగర్ బైపోల్.. బరిలోకి టీడీపీ..!
హుజూర్ నగర్ ఉపఎన్నిక మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే బీజేపీ ఎంట్రీతో త్రిముఖ పోరుగా అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీపీఐ కూడా అభ్యర్థిని బరిలో దించేందుకు ప్లాన్ వేస్తుంది. అయితే తాజాగా టీడీపీ కూడా పోటీకి సిద్ధమైంది. దీంతో హుజూర్ నగర్ పోరు హోరాహోరిగా సాగనుంది. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అభ్యర్థిని […]

హుజూర్ నగర్ ఉపఎన్నిక మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే బీజేపీ ఎంట్రీతో త్రిముఖ పోరుగా అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీపీఐ కూడా అభ్యర్థిని బరిలో దించేందుకు ప్లాన్ వేస్తుంది. అయితే తాజాగా టీడీపీ కూడా పోటీకి సిద్ధమైంది. దీంతో హుజూర్ నగర్ పోరు హోరాహోరిగా సాగనుంది. హుజూర్‌నగర్ ఉపఎన్నికలో పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అభ్యర్థిని ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
అయితే గతంలో టీడీపీ మహాకూటమిలో భాగంగా హుజూర్‌నగర్ ఎన్నికల్లో పాల్గొనలేకపోయింది. అయితే ఈ సారి కూటమిలో టీడీపీ లేదు. దీంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరిక మేరకు పోటీ చేస్తున్నట్లు టీడీపీ సీనియర్ నేత రావుల ప్రకటించారు. ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటామన్నారు. పార్టీని వీడిన వారు తెలంగాణలో టీడీపీ బలహీన పడిందని విష ప్రచారం చేస్తున్నారని.. తమ పార్టీ బలం, బలగం కార్యకర్తలే అని అన్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ సతీమణి పద్మావతి, బీజేపీ తరఫున రామారావు పోటీలో ఉన్నారు. అక్టోబర్ 21న పోలింగ్ జరగనుంది. అనంతరం 24న ఫలితాలు వెలువడనున్నాయి.