TDP MLA Ganta: సంచలన నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యే గంటా.. శాసనసభ్యత్వానికి రాజీనామా
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు....
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ 100 శాతం ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిరసనగా గంటా ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను స్పీకర్ తమ్మినేని సీతారాంకుకు పంపారు. తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో స్పీకర్‌ను కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని పేర్కొంటూ ఆయన వరస ట్వీట్లు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమ గా మాత్రమే చూడొద్దు. విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవం, మా విశాఖ ప్రజల ఉఛ్వాస నిశ్వాస. మా నగరం పేరే ఉక్కు నగరం. pic.twitter.com/l0gg7gT3kk
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) February 5, 2021
2019 అసెంబ్లీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు పార్టీ విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అయితే, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. కాగా గంటా టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరతారనే వార్తలు వైరలయ్యాయి. కానీ వివిధ కారణాల వల్ల ఆ దిశగా అడుగులు పడలేదు. బీజేపీలో కూడా ఆయన చేరేందుకు చర్చలు జరుపుతున్నారంటూ వాదనలు తెరపైకి వచ్చాయి. కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు.