Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: హస్తినకు ఏపీ పంచాయితీ.. ఎల్లుండి మోదీ, అమిత్‌షాతో భేటికి చంద్రబాబు యత్నం

ఏపీలో పొలిటికల్‌ వార్‌ సీన్‌ ఢిల్లీకి మారుతోంది. రెండు రోజుల పాటు పోటాపోటీ నిరసనలు చేపట్టిన వైసీపీ ,టీడీపీ నేతలు ఢిల్లీ బాటపడుతున్నారు.

AP Politics: హస్తినకు ఏపీ పంచాయితీ..  ఎల్లుండి మోదీ, అమిత్‌షాతో భేటికి చంద్రబాబు యత్నం
Chandrababu
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 23, 2021 | 9:07 AM

Chandrababu: ఏపీలో పొలిటికల్‌ వార్‌ సీన్‌ ఢిల్లీకి మారుతోంది. రెండు రోజుల పాటు పోటాపోటీ నిరసనలు చేపట్టిన వైసీపీ ,టీడీపీ నేతలు ఢిల్లీ బాటపడుతున్నారు. ఎల్లుండి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు. ఏపీలో పరిస్థితిని ఆయనకు వివరించనున్నారు. రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాలను అపాయింట్లమెంట్ల కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇటు వైసీపీ నేతలు కూడా ఢిల్లీ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. టీడీపీ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరనున్నారు.

ఇదిలా ఉండగా, తన తల్లిని తిట్టారంటూ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారని ఇది ఎంతటి దుర్మార్గమని చంద్రబాబు అంటున్నారు. అతని రాజకీయ ప్రాపకం కోసం సాక్షాత్తూ అతని తల్లిని, చెల్లిని లాగే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. “పట్టాభి వీళ్ల తల్లిని తిట్టాడట! ఆ పదమే నేను ఎప్పుడూ వినలేదు. నాకు బూతులు రావు. యుక్తవయసులో రాజకీయాల్లోకి వచ్చా. అప్పటికి ఇతను బుడ్డీపాలు తాగుతుంటాడు. అలాంటిది నాపై ఏం మాట్లాడారో విన్నారా!” అంటూ చంద్రబాబు చెబుతున్నారు.

పట్టాభి ఏదో అన్నారని లేనిదాన్ని సృష్టించి సీఎం జగన్ ఆయన తల్లిని కూడా తీసుకొచ్చారన్న చంద్రబాబు.. “అమ్మపై అంత మమకారం ఉందా? ఆ రోజు ఆమెను ఊరూరా తిప్పావు. ఆయనకో చెల్లి ఉంది. ఆమెను నాకు కౌంటర్‌గా జగనన్న బాణం అని ఊరూరా తిప్పారు. ఆ బాణం ఇప్పుడు ఎక్కడ తిరుగుతోంది? తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని నువ్వు నాకు నీతులు చెబుతావా? ఆరోజు జైలుకు పోతే నీ తల్లిని ఉపయోగించుకున్నావు. చెల్లిని ఉపయోగించుకున్నావు. ఎన్నికల ముందు జగన్‌ బాబాయి వివేకానంద రెడ్డిని నేనే చంపించానన్నారు. ఎన్నికలయ్యాక వివేకా కూతురు సీబీఐ విచారణ కావాలని కోర్టుకెళ్లి పోరాడుతుంటే వీళ్లు మాత్రం ఏం మాట్లాడడం లేదు. ఎవరు మోసగాడు? ఎవరు మోసం చేస్తున్నది?” అంటూ చంద్రబాబు వైసీపీపై తీవ్రంగా స్పందించారు.

Read also: Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..