ఎమ్మెల్యేల్లో కలవరం.. మూడు రోజుల పాటు హోటల్‌కే పరిమితం.. సీఎం విజయ్ మాస్టర్ ప్లాన్!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు మహాబలిపురంలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశం నేపథ్యంలో ఎమ్మెల్యేలు మూడు రోజుల పాటు హోటల్‌లోనే ఉండాలని సీఎం విజయ్ ఆదేశించినట్లు సమాచారం.

ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు విపక్షాలతో బేరసారాలు సాగిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై సీఎం విజయ్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే అంశంపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు మినహా ఇతరులెవరూ హోటల్‌లోకి రావొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఇక డిప్యూటీ స్పీకర్ వ్యవహారం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముంది. అలాగే కలెక్టర్‌ను బెదిరించినట్లు వచ్చిన ఆరోపణలపైనా విజయ్ ఎమ్మెల్యేలతో మాట్లాడే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలను ఒకే చోట ఉంచాలన్న నిర్ణయం వెనుక రాజకీయ వ్యూహం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ భేటీలో విజయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని తమిళనాడు రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..