మోదీ, అమిత్‌ షాపై సీతారాం ఏచూరీ తీవ్ర విమర్శలు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను దుర్యోధనుడు, దుశ్శాసనుడితో పోల్చారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ. పశ్చిమ బెంగాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ మహా భారతం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ‘100 మంది కౌరవ సోదరుల్లో మనం దుర్యోధన, దుశ్శాసనుల పేర్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ (భాజపా)లోనూ మనం ఎంతమంది పేర్లను గుర్తుకు తెచ్చుకుంటున్నాం. కేవలం మోదీ-అమిత్‌ […]

మోదీ, అమిత్‌ షాపై సీతారాం ఏచూరీ తీవ్ర విమర్శలు
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2019 | 7:12 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాను దుర్యోధనుడు, దుశ్శాసనుడితో పోల్చారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ. పశ్చిమ బెంగాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ మహా భారతం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. ‘100 మంది కౌరవ సోదరుల్లో మనం దుర్యోధన, దుశ్శాసనుల పేర్లను మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ (భాజపా)లోనూ మనం ఎంతమంది పేర్లను గుర్తుకు తెచ్చుకుంటున్నాం. కేవలం మోదీ-అమిత్‌ షా పేర్లు మాత్రమే. మహా భారతంలో చివరకు కౌరవులు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో.. అటువంటి పరిస్థితులనే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న రాజకీయ మహాభారతంలో భాజపా ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఏడు దశల్లో ఈ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 23న జరిగిన మూడో దశ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 5 స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఏప్రిల్‌ 29న రాష్ట్రంలోని మరో 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2014 ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ 34 సీట్లను గెలుచుకుంది. ఈ సారి అన్ని స్థానాల్లోనూ గెలుపే లక్ష్యంగా పని చేస్తోంది. రాష్ట్రంలో చతుర్ముఖ పోటీ నెలకొంది. టీఎంసీ, భాజపా, కాంగ్రెస్‌, వామపక్షాలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాయి.

దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే