టీడీపీ-వైసీపీలకు తలనొప్పిగా సత్తెనపల్లి సీటు కేటాయింపు

టీడీపీ, వైసీపీలకు సత్తెనపల్లి సీటు కేటాయింపు తలనొప్పిగా మారింది. కోడెల వద్దంటూ స్థానిక తెలుగు తమ్ముళ్లు నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఇదే స్థాయిలో వైసీపీలోనూ నిరసనలు హోరెత్తుతున్నాయి. సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీలోని అంబటి వ్యతిరేక వర్గీయులు ఆందోళన చేపట్టారు. దీంతో అధినేతలకు అభ్యర్థి ఎంపిక ఇబ్బందికరంగా మారింది. కోడెలకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ కోడెల హఠావో.. సత్తెనపల్లి బచావో అంటూ ర్యాలీలు […]

  • Tv9 Telugu
  • Publish Date - 12:59 pm, Thu, 14 March 19
టీడీపీ-వైసీపీలకు తలనొప్పిగా సత్తెనపల్లి సీటు కేటాయింపు

టీడీపీ, వైసీపీలకు సత్తెనపల్లి సీటు కేటాయింపు తలనొప్పిగా మారింది. కోడెల వద్దంటూ స్థానిక తెలుగు తమ్ముళ్లు నిరసనలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఇదే స్థాయిలో వైసీపీలోనూ నిరసనలు హోరెత్తుతున్నాయి. సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తారన్న ప్రచారంతో వైసీపీలోని అంబటి వ్యతిరేక వర్గీయులు ఆందోళన చేపట్టారు. దీంతో అధినేతలకు అభ్యర్థి ఎంపిక ఇబ్బందికరంగా మారింది.

కోడెలకు వ్యతిరేకంగా తెలుగు తమ్ముళ్లు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ కోడెల హఠావో.. సత్తెనపల్లి బచావో అంటూ ర్యాలీలు చేపట్టారు. అయితే.. సత్తెనపల్లి నుంచి తానే పోటీ చేస్తున్నట్లు కోడెల స్పష్టం చేశారు. 22న తాను నామినేషన్ వేస్తున్నట్లుగా తెలిపాలి. పార్టీలో చిన్న చిన్న సమస్యలున్నాయని.. అవి తొందరలోనే సర్దుకుంటాయన్నారు కోడెల.

ఇటు వైసీపీలనూ.. అంబటికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. వైసీపీ తరపున అంబటి పోటీ చేస్తే తాము ఓడిస్తామంటూ ఆపార్టీలోని వ్యతిరేక వర్గం హెచ్చరిస్తోంది. దీంతో సత్తెనపల్లి సీటు కేటాయింపుపై వైసీపీ అధిష్టానం తర్జనభర్జనలు పడుతోంది.