శిద్ధాకు ఎంపీ వద్దు, ఎమ్మెల్యే కావాలి: తెలుగు తమ్ముళ్ల డిమాండ్

సీఎం కార్యాలయం ముందు తెలుగు తమ్ముళ్ల రచ్చ అందుకు నేను సిద్ధమే, కార్యకర్తలు సంయమనం పాటించాలి: శిద్ధా   అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో పార్టీల మధ్యనే కాదు సొంత పార్టీల మధ్య కూడా వేడి పెరుగుతోంది. సీట్లు ఆశింస్తూ కొందరు, అలకబూని మరికొందరూ వార్తలకెక్కుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో తెలుగు తమ్ముళ్లు రచ్చ చేస్తున్నారు. జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్‌ను మళ్లీ మంత్రి శిద్ధా రాఘవరావుకే కేటాయించాలని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని […]

  • Vijay K
  • Publish Date - 2:06 pm, Thu, 14 March 19
శిద్ధాకు ఎంపీ వద్దు, ఎమ్మెల్యే కావాలి: తెలుగు తమ్ముళ్ల డిమాండ్
  • సీఎం కార్యాలయం ముందు తెలుగు తమ్ముళ్ల రచ్చ
  • అందుకు నేను సిద్ధమే, కార్యకర్తలు సంయమనం పాటించాలి: శిద్ధా

 

అమరావతి: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో పార్టీల మధ్యనే కాదు సొంత పార్టీల మధ్య కూడా వేడి పెరుగుతోంది. సీట్లు ఆశింస్తూ కొందరు, అలకబూని మరికొందరూ వార్తలకెక్కుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో తెలుగు తమ్ముళ్లు రచ్చ చేస్తున్నారు. జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టిక్కెట్‌ను మళ్లీ మంత్రి శిద్ధా రాఘవరావుకే కేటాయించాలని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని డిమాండ్ చేస్తున్నారు.

ప్లకార్డులు చేతబూని, నినాదాలు చేస్తున్నారు. శిద్ధా రాఘవరావుకు ఎంపీ టిక్కెట్ కేటాయించొద్దని, మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్టే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్పందించిన మంత్రి కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చలు జరుపుతానని తెలిపారు. అయితే కార్యకర్తలతో చర్చించిన పిదప తాను తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

మంత్రి శిద్ధా రాఘవరావును ఈసారి పార్లమెంట్‌కు పంపాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దర్శి తెలుగు తమ్ముళ్లు గత కొన్ని రోజులుగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తాజాగా అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని మరీ వారి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.