అన్నయ్య ఇక్కడి వాడే.. ప్రియాంక ఫైర్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన నోటీసులపై ఆయన సొదరి ప్రియాంకా స్పందించింది. రాహుల్ భారతీయుడని యావత్ దేశానికి తెలుసని అన్నారు. ఆయన ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగాడని అన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఈ విమర్శలను రబ్బిష్ గా కొట్టి పారేశారు. అయితే రాహుల్ గాంధీ విదేశీ పౌరుడంటూ గతకొంత కాలంగా వస్తొన్న ఆరోపణలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఈ విషయంపై రాహుల్‌కు ఇవాళ నోటీసులు […]

అన్నయ్య ఇక్కడి వాడే.. ప్రియాంక ఫైర్
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 5:33 PM

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన నోటీసులపై ఆయన సొదరి ప్రియాంకా స్పందించింది. రాహుల్ భారతీయుడని యావత్ దేశానికి తెలుసని అన్నారు. ఆయన ఇక్కడే పుట్టి.. ఇక్కడే పెరిగాడని అన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఈ విమర్శలను రబ్బిష్ గా కొట్టి పారేశారు.

అయితే రాహుల్ గాంధీ విదేశీ పౌరుడంటూ గతకొంత కాలంగా వస్తొన్న ఆరోపణలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఈ విషయంపై రాహుల్‌కు ఇవాళ నోటీసులు కూడా జారీచేసింది. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ నోటీసులు ఇస్తున్నట్లు పేర్కొంది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బ్యాకప్స్ లిమిటెడ్ పేరిట బ్రిటన్‌లో రిజిస్టరైన కంపెనీలో రాహుల్ ఒక డైరక్టర్‌గా ఉన్నారని.. అలాగే 10/10/2005 నుంచి 31/10/2006 మధ్య కంపెనీ వార్షిక రిటర్నుల్లో పుట్టిన తేదీ 19/06/1970 అని.. అంతేగాక బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారని సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర హోం శాఖకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పౌరసత్వ విభాగం డైరెక్టర్ బీసీ జోషీ రాహుల్‌కు రాసిన లేఖలో వీటి గురించి వివరించారు. సుబ్రహ్మణ్య స్వామి హోంశాఖకు అందించిన లేఖకు ఆధారాలను కూడా జత చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీనిపై నిజానిజాలేంటో తెలియజేస్తూ రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని రాహుల్‌ని కోరారు.

Latest Articles