AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబుకు రాంమాధవ్ దిమ్మతిరిగే షాక్ !

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ దిమ్మతిరిగిపోయే షాకిచ్చారు. దాంతో టిడిపిపై పగ తీర్చుకోవడానికి బిజెపి అధినేతలు సిద్దంగా వున్నట్లు తేటతెల్లమైంది. ఇంతకీ రాంమాధవ్ ఏం చేశారు ? చంద్రబాబుకు షాక్ తగిలేలా ఏం చేశారు ? రీడ్ దిస్ స్టోరీ.. తెలుగుదేశం పార్టీతో బిజెపిది సంబంధాలు టామ్ అండ్ జెర్రీ ఆటలా మారాయి. 1998, 1999, 2004లలో బిజెపితో జతకట్టి రెండుసార్లు లాభపడి.. మూడోసారి పరస్పరం ముంచేసుకున్న […]

చంద్రబాబుకు రాంమాధవ్ దిమ్మతిరిగే షాక్ !
Rajesh Sharma
|

Updated on: Oct 30, 2019 | 5:13 PM

Share

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ దిమ్మతిరిగిపోయే షాకిచ్చారు. దాంతో టిడిపిపై పగ తీర్చుకోవడానికి బిజెపి అధినేతలు సిద్దంగా వున్నట్లు తేటతెల్లమైంది. ఇంతకీ రాంమాధవ్ ఏం చేశారు ? చంద్రబాబుకు షాక్ తగిలేలా ఏం చేశారు ? రీడ్ దిస్ స్టోరీ..

తెలుగుదేశం పార్టీతో బిజెపిది సంబంధాలు టామ్ అండ్ జెర్రీ ఆటలా మారాయి. 1998, 1999, 2004లలో బిజెపితో జతకట్టి రెండుసార్లు లాభపడి.. మూడోసారి పరస్పరం ముంచేసుకున్న బంధం టిడిపి-బిజెపిలది. ఆ తర్వాత సుదీర్ఘకాలంపాటు రెండు పార్టీలు అంటీ ముట్టనట్లే వున్నా.. 2014లో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రెండు పార్టీలు పరస్పరం ప్రయోజనాలు ఆశించి మళ్ళీ జతకట్టాయి. ఫలితంగా ఇద్దరూ లాభపడ్డారు.

2014 ఎన్నికల్లో కలిసి పోటీచేసిన బిజెపి-టిడిపిలు నెంబర్ పరంగా బాగానే బెనిఫిట్ అయ్యాయి. రాష్ట్రంలో టిడిపి, కేంద్రంలో బిజెపికి కాస్తో కూస్తూ వీరిద్దరి కలయిక సీట్లు పెరిగేలా చేసింది. అయితే.. ఈకాపురం అయిదేళ్ళ కొనసాగలేదు. చంద్రబాబు తనవ్యూహాలకు పదునుపెడుతూ బిజెపిని టార్గెట్ చేయడం ద్వారా ఏపీలో పలు పనులు పూర్తి కాకపోవడానికి మోదీ ప్రభుత్వమే కారణమని నెపం వారి మీద మోపి తాను గట్టెక్కాలనుకున్నారు. అయితే చంద్రబాబు అంచనాలు బెడిసి కొట్టాయి. కేంద్రంలో మోదీ తిరిగి రెండోసారి అధికారం చేపట్టగా.. చంద్రబాబు ఓటమి భారాన్ని మూటగట్టుకుని, అస్థిత్వాన్నే ప్రశ్నార్థం చేసుకున్నారు.

అయితే కాలం అన్ని సార్లు ఓకేలా వుండదు కదా.. అదే సమయంలో రాజకీయాల్లో శాశ్వత శృత్వుత్వం, శాశ్వత మిత్రుత్వం వుండదు కాబట్టి.. చంద్రబాబు మనసు మళ్ళీ బిజెపివైపు మళ్ళింది. బిజెపితో వ్యక్తిగత శతృత్వం ఏమీ లేదని.. విడిపోవాలన్నది అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమని సాఫ్ట్ కార్నర్‌కు తాను మళ్లుతున్నట్లు బిజెపి సంకేతాలివ్వడం మొదలు పెట్టారు చంద్రబాబు.

సరిగ్గా ఇక్కడే బిజెపి ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చంద్రబాబుకు షాకిచ్చారు. దిమ్మతిరిగేలా మాట్లాడారు. గుంటూరులో గాంధీజీ సంకల్ప ర్యాలీని ప్రారంభించిన రాంమాధవ్ బుధవారం ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. టిడిపి ఒక మునిగిపోతున్న నావ అన్నారు. బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు చేసే ప్రయత్నాలు వృధా అని రాం మాధవ్ అన్నారు. టిడిపి నుంచి వలసలు ఆగవని, ఆ పార్టీ దుకాణం మూత పడక తప్పదని రాం మాధవ్ జోస్యం చెప్పారు. ఏదో రకంగా బిజెపి గుడ్ లుక్స్‌లో పెడదామనుకున్న చంద్రబాబుకు రాం మాధవ్ మాటలు నిజంగా షాకే అంటున్నారు విశ్లేషకులు.