షర్మిలకు రాజేంద్ర ప్రసాద్ కౌంటర్

షర్మిలకు రాజేంద్ర ప్రసాద్ కౌంటర్

విజయవాడ: ఏపీ మంత్రి లోకేశ్‌పై వైఎస్ షర్మిల చేసిన విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ కౌంటరిచ్చారు. లోకేశ్ బాబుకు సత్తా ఉందని, నాయకత్వ లక్షణాలున్నాయని చెప్పారు. లోకేశ్‌ బాబుకు ఐటీ శాఖలో 57 అవార్డులు వచ్చాయని, కేటీఆర్‌కు ఎన్ని వచ్చాయని ప్రశ్నించారు. చుట్టరికం కలుపుకుని కేసీఆర్, కేటీఆర్‌ను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ శాఖలను లోకేశ్ బాబు చేపట్టిన తర్వాత 106 అవార్డులు వచ్చాయని, కేటీఆర్‌కు ఏమొచ్చాయని ప్రశ్నించారు రాజేంద్ర ప్రసాద్. కేంద్ర […]

Vijay K

|

Mar 25, 2019 | 6:48 PM

విజయవాడ: ఏపీ మంత్రి లోకేశ్‌పై వైఎస్ షర్మిల చేసిన విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ కౌంటరిచ్చారు. లోకేశ్ బాబుకు సత్తా ఉందని, నాయకత్వ లక్షణాలున్నాయని చెప్పారు. లోకేశ్‌ బాబుకు ఐటీ శాఖలో 57 అవార్డులు వచ్చాయని, కేటీఆర్‌కు ఎన్ని వచ్చాయని ప్రశ్నించారు. చుట్టరికం కలుపుకుని కేసీఆర్, కేటీఆర్‌ను వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.

పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ శాఖలను లోకేశ్ బాబు చేపట్టిన తర్వాత 106 అవార్డులు వచ్చాయని, కేటీఆర్‌కు ఏమొచ్చాయని ప్రశ్నించారు రాజేంద్ర ప్రసాద్. కేంద్ర ప్రభుత్వం నుండి ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణ శాఖల్లో 160 అవార్డులు లోకేశ్ బాబు తీసుకున్నారని, అదీ తమ సత్తా అని షర్మిలకు రాజేంద్ర ప్రసాద్ కౌంటరిచ్చారు.

కేటీఆర్‌కు ఐటీ శాఖ కేటాయించడం చూసి, ఇక్కడ లోకేశ్‌కు కూడా ఐటీ శాఖ కేటాయించారని, అయినా లోకేశ్ చేసిందేమీ లేదని లోకేశ్‌పై షర్మిలా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన డేటాని చోరీ చేసి తనకు కావాల్సిన కంపెనీలకు లోకేశ్ ఇచ్చుకున్నారంటూ షర్మిల అంతకుముందు మండిపడ్డారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu