AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: తులసితో అదిరిపోయే చర్మ ఆరోగ్యం.. ఇలా వాటితే ముఖం మిళమిళ మెరవాల్సిందే!

తులసి మొక్క దీనికి మన హిందూ సాంప్రదాయంలో అధ్యాత్మికత పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మొక్కను ఇంట్లో పెట్టుకొని పూజిస్తారు. అయితే ఈ తులసి మన ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని చాలా మంది తెలియవదు. అవును తులసి మన పూర్తి ఆరోగ్యంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించడంతో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి తులసి అనేది చర్మ ఆరోగ్యానికి ఎలా దోహదపడుతుందో తెలుసుకుందాం.

Beauty Tips: తులసితో అదిరిపోయే చర్మ ఆరోగ్యం.. ఇలా వాటితే ముఖం మిళమిళ మెరవాల్సిందే!
Tulasi Benefits For Skin
Anand T
|

Updated on: Feb 01, 2026 | 4:58 PM

Share

ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ జాతీయ ఆయుర్వేద సంస్థ ప్రకారం తులసి అనేది చర్మ సౌందర్యాన్ని పెంచడంతో ఎంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముఖంపై మొటిమలు, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. తులసిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా , ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

తులసి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు !

నిపుణుల ప్రకారం: తులసి నీరు మన శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి చర్మంపై మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే కొత్త మచ్చలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. తులసి ఆకులను రోజూ తినడం వల్ల అంతర్గత చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. తులసిని పలు విధాలుగా చర్మ ఆరోగ్యానికి ఉపయోగింవచ్చు. తులసి ఫేస్ ప్యాక్ ద్వారా ముఖాన్ని మెరిసేలా చేయవచ్చు. ఇందుకోసం ఎనిమిది నుండి పది తాజా తులసి ఆకులను మెత్తగా పేస్ట్ లా చేసి.. దానిలో ముల్తానీ మిట్టి లేదా తేనెతో కలపండి. ఈ పేస్ట్‌ను మీ ముఖంపై పదిహేను నుండి ఇరవై నిమిషాలు అప్లై చేసి, తర్వాత కడిగేయండి. ఇది మొటిమలను తొలగించడంలో, మచ్చలను తగ్గించడంలో, జిడ్డుగల చర్మాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వారానికి రెండు నుండి మూడు సార్లు దీన్ని ఉపయోగిస్తే.. మీ చర్మం మిళమిళా మెరిసిపోవాల్సిందే

తులసి నీరు : తులసి నీరు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. దీని కోసం, ఐదు నుండి ఏడు తులసి ఆకులను రాత్రిపూట శుభ్రమైన నీటిలో నానబెట్టండి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగడం వల్ల విష పదార్థాలు బయటకు వెళ్లి, రక్తాన్ని శుద్ధి చేసి, చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ఇది మొటిమలకు సులభమైన, ప్రభావవంతమైన నివారణ.

తులసి టీ : తులసి టీ రుచికరమైనది మాత్రమే కాదు, దీనికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ టీ తయారు చేయడానికి, నాలుగు నుండి ఐదు తులసి ఆకులను నీటిలో మరిగించండి. నిమ్మకాయ లేదా తేనెతో కలిపి తాగడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, చర్మ కాంతి మెరుగుపడుతుంది.

పచ్చి తులసి ఆకులు: ఒత్తిడి వల్ల కలిగే మొటిమలపై ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. పచ్చి తులసి ఆకులను నమలడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం రెండు నుండి మూడు తాజా తులసి ఆకులను నమలడం వల్ల మీకు తాజాదనం లభిస్తుంది. అలాగే చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి కాపాడుతుంది.

రోగనిరోధక శక్తి: తులసిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇది చౌకైన, సహజమైన, సులభంగా లభించే నివారణ. మీకు మొటిమలు లేదా మచ్చలు తీవ్రంగా ఉంటే ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించి తులసిని తీసుకోండి. దీనితో పాటు, మంచి పరిశుభ్రత పాటించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం వల్ల చర్మ కాంతి చాలా రెట్లు పెరుగుతుంది

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..
మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..