ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ తాజాగా సోషల్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. సోమవారం ప్రియాంక తన పేరు మీద అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించగా.. కొద్ది క్షణాల్లోనే ఆమె ఫాలోవర్లు వేలకు చేరారు. ప్రస్తుతం ఆమెను 65.5వేల మంది ఫాలో అవుతుండగా.. ఆమె ఏడుగురిని ఫాలో అవుతోంది. అందులో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలా, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. కాగా […]
ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంక గాంధీ తాజాగా సోషల్ మీడియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. సోమవారం ప్రియాంక తన పేరు మీద అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించగా.. కొద్ది క్షణాల్లోనే ఆమె ఫాలోవర్లు వేలకు చేరారు. ప్రస్తుతం ఆమెను 65.5వేల మంది ఫాలో అవుతుండగా.. ఆమె ఏడుగురిని ఫాలో అవుతోంది. అందులో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు అహ్మద్ పటేల్, రణ్‌దీప్ సుర్జేవాలా, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు.
కాగా ఇప్పటివరకు ప్రియాంక ఎలాంటి ట్వీట్ చేయలేదు. మరోవైపు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ప్రియాంకకు ఆమె భర్త రాబర్ట్ వాద్రా అభినందనలు తెలిపారు. పొలిటికల్ ఎంట్రీతో ప్రియాంక పరిపూర్ణ మహిళగా మారిందంటూ ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు.