PM Modi emotional: ప్రియమైనవారిని కోల్పోయాం.. భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్రమోదీ

తన నియోజకవర్గం వారణాసికి చెందిన వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

PM Modi emotional: ప్రియమైనవారిని కోల్పోయాం.. భావోద్వేగానికి లోనైన ప్రధాని నరేంద్రమోదీ
PM Narendra Modi
Follow us

|

Updated on: May 21, 2021 | 3:54 PM

PM Narendra Modi Emotional: కరోనా కట్టడిలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు చేస్తున్న కృషిని మరోసారి ప్రశంసించారు ప్రధాని నరేంద్ర మోదీ. తన నియోజకవర్గం వారణాసికి చెందిన వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రధాని.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరోనాపై పోరులో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని కన్నీరు పెట్టుకున్నారు. ఎక్కడ మహమ్మారి ప్రబలిందో.. అక్కడ చికిత్స అందాల్సిందే అన్నది మన కొత్త నినాదమని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రజలందరికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిందేనని స్పష్టంచేశారు. బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణ ఇప్పుడు మరో పెద్ద సవాల్‌ అన్నారు మోదీ.

దేశంలో కరోనా పరిస్థితిపై ఎప్పటిప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. తన సొంత నియోజకవర్గమైన వారణాసికి చెందిన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఉన్నట్టుండి భావోద్వేగానికి లోనయ్యారు. కోవిడ్ మహమ్మారికి మనవాళ్లు ఎంతో మంది బలయ్యారని ఒకింద ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్ బలి తీసుకుంటుదని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. డాక్టర్లు, ఇతర ఫ్రంట్ లైన్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి కోవిడ్‌పై పోరాటం చేస్తున్నారని కొనియాడారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసాలను అభినందించారు. కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4,209 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో 30,27,925 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 14,82,754 మందికి వ్యాక్సిన్‌ తీసుకున్నారని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది.

Read Also…  నల్ల ఉప్పు గురించి మీకు తెలుసా..? అనేక రోగాలకు నివారణ..! ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..

మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
మోదీతో టీవీ9 ఎడిటర్స్‌ రౌండ్‌టేబుల్‌ ఇంటర్వ్యూ
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో ఓ సెన్సేషన్ TV9.. ప్రధాని మోదీ సంచలన ఇంటర్వ్యూ..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిర్ణయం అప్రజాస్వామికం.. కేటీఆర్..
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ఆ వానరంపై మానవత్వం చాట్టుకున్న గ్రామస్థులు.. ఏం చేశారంటే..
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
ట్రిపులార్ ట్యాక్స్.. సీఎం రేవంత్‌పై BJLP నేత సంచలన ఆరోపణలు
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
వారిద్దరి కుట్రలో భాగంగానే కేసీఆర్‌పై నిషేధం- బీఆర్ఎస్ ఎమ్మెల్యే
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
తన ఎగ్ ఫ్రీజింగ్ గురించి చెప్పిన హీరోయిన్ మెహరీన్.!
టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే.!
టీ20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే.!