వైసీపీలోకి వీరశివారెడ్డి.. ప్లాన్ ఇదే..

టీడీపీకి గుడ్ బై చేప్పేశారు వీరాశివారెడ్డి. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం టిక్కెట్ కోసం చివరి దాకా ప్రయత్నాలు చేసిన వీరశివారెడ్డి చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో పోలింగ్ సమయంలో వైసీపీకి మద్దతు పలికాడు. తర్వాత అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈ మధ్యలో వీరాశివరెడ్డి సైలెంట్ గా ఓ స్కెచ్ గీశాడు. ఇంతకీ వీరాశివారెడ్డి గీసిన ప్లాన్ ఏంటి? ఇప్పుడు కడప జిల్లా రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ సాగుతోంది. […]

వైసీపీలోకి వీరశివారెడ్డి.. ప్లాన్ ఇదే..
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2019 | 7:44 PM

టీడీపీకి గుడ్ బై చేప్పేశారు వీరాశివారెడ్డి. త్వరలోనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం టిక్కెట్ కోసం చివరి దాకా ప్రయత్నాలు చేసిన వీరశివారెడ్డి చంద్రబాబు టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో పోలింగ్ సమయంలో వైసీపీకి మద్దతు పలికాడు. తర్వాత అధికారికంగా ప్రకటించాడు. అయితే ఈ మధ్యలో వీరాశివరెడ్డి సైలెంట్ గా ఓ స్కెచ్ గీశాడు. ఇంతకీ వీరాశివారెడ్డి గీసిన ప్లాన్ ఏంటి? ఇప్పుడు కడప జిల్లా రాజకీయ వర్గాల్లో దీనిపైనే చర్చ సాగుతోంది.

కమలాపురం టిక్కెట్ ని చంద్రబాబు నిరాకరించడంతో.. తన రాజకీయ భవిష్యత్తు కంటే కుమారుడి పొలిటికల్ కెరీర్ మీద వీరశివారెడ్డి ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా తాను వైసీపీకి మద్దతు ఇస్తానని.. వైసీపీ పవర్ లోకి వస్తే తన కుమారుడు అనిల్ కుమార్ రెడ్డిని కడప జడ్పీ చైర్మన్ చేయాలన్న హామీ తీసుకున్నారు.ఇంతకీ అసలు ప్లాన్ ఏంటంటే.. 1995లో వచ్చిన రిజర్వేషన్లు మళ్లీ రిపీట్ అవుతాయని వీరశివారెడ్డి ముందుగానే గ్రహించి ఆ హామీ తీసుకున్నారని సమాచారం.

1995లో కడపకి ఓసీ జనరల్ వచ్చింది. ఈసారి కూడా ఓసీ జనరల్ వస్తుందని గ్రహించిన వీరశివారెడ్డి తన కుమారుడు అనిల్ కుమార్ రెడ్డికి జడ్పీ చైర్మన్ పదవి అడిగారు. ఆ హామీతోనే లాస్ట్ మినిట్ లో వీరశివారెడ్డి వైసీపీకి సపోర్ట్ చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు జోరందుకున్నాయి.