పొలిటికల్ మిర్చి: వినోద్ సెట్ అయ్యారు.. మరి కవిత…?

వారిద్దరూ కీలక నేతలు. హస్తినలో పార్టీ వాయిస్ గట్టిగా వినిపించిన సీనియర్లు. అయితే అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. వారి సేవలు గుర్తించిన పార్టీ ఒకరికి పదవి ఇచ్చింది. ఇంకొకరి సంగతేంటి అనేది చర్చగామారింది. 2014 లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో ఎంపీలుగా వినోద్ కుమార్, కవితలు కీలకంగా వ్యవహరించారు. పార్టీ పరంగా ఇద్దరూ క్రియాశీలకంగా ఉండేవారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో వారికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు […]

పొలిటికల్ మిర్చి: వినోద్ సెట్ అయ్యారు.. మరి కవిత...?
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 23, 2019 | 5:01 PM

వారిద్దరూ కీలక నేతలు. హస్తినలో పార్టీ వాయిస్ గట్టిగా వినిపించిన సీనియర్లు. అయితే అనూహ్యంగా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. వారి సేవలు గుర్తించిన పార్టీ ఒకరికి పదవి ఇచ్చింది. ఇంకొకరి సంగతేంటి అనేది చర్చగామారింది.

2014 లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఢిల్లీలో ఎంపీలుగా వినోద్ కుమార్, కవితలు కీలకంగా వ్యవహరించారు. పార్టీ పరంగా ఇద్దరూ క్రియాశీలకంగా ఉండేవారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిపాలవడంతో వారికి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు సీఎం కేసీఆర్. అందులో భాగంగానే మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ పదవి ఇచ్చారు. వినోద్ కి మంచి బెర్త్ దొరకడంతో అందరి చూపు కవితపై పడింది.

కుదిరితే కేబినెట్ మంత్రి పదవి లేదా రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవి ఇస్తారనే వార్తలు గులాబీ దళాల్లో పచార్లు చేస్తున్నాయి. కేబినెట్ లోకి ఇద్దరు మహిళలకు అవకాశం ఉంటుందని చెప్పిన కేసీఆర్.. కవితకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారేమో అని చర్చించుకుంటున్నారు.

మరోవైపు రైతు సమన్వయ సమితి అధ్యక్షుడుగా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఆ పోస్ట్ ఖాలీ అయింది. నిజామాబాద్ లో రైతు సమస్యలు ఎక్కువ కాబట్టి ఆ పదవిని కవితకు ఇస్తే ఎలా ఉంటుందీ.. అనే చర్చలు కూడా ప్రగతి భవన్ వేదికగా సాగుతున్నాయని సమాచారం. అయితే అలాంటిదేమీ లేదని, తమకు పదవులు ఇంపార్టెంట్ కాదని కొట్టి పారేస్తున్నారు కవిత వర్గీయులు.