గులాబీ బాస్ కొత్త టార్గెట్..!

పదవుల పందేరం ఎప్పడు? అనే ఈ ప్రశ్న కొన్నాళ్లుగా గులాబీ దళంలో వినిపిస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అయినా నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం ఇంకా పూర్తి చేయలేదు. త్వరలోనే భర్తీ అని సీఎం కేసీఆర్ చెప్పినట్లే చెప్పి ఇప్పడు మళ్లీ డెడ్ లైన్ పొడిగించారు. మళ్లీ ఎప్పుడో కొత్త ముహూర్తం? ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ విస్తరణ సమయంలో టీఆర్ఎస్ నేతలకు పదవుల జాతర అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. 12 […]

గులాబీ బాస్ కొత్త టార్గెట్..!
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 11:33 AM

పదవుల పందేరం ఎప్పడు? అనే ఈ ప్రశ్న కొన్నాళ్లుగా గులాబీ దళంలో వినిపిస్తోంది. రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు అయినా నామినేటెడ్ పోస్టుల భర్తీ మాత్రం ఇంకా పూర్తి చేయలేదు. త్వరలోనే భర్తీ అని సీఎం కేసీఆర్ చెప్పినట్లే చెప్పి ఇప్పడు మళ్లీ డెడ్ లైన్ పొడిగించారు. మళ్లీ ఎప్పుడో కొత్త ముహూర్తం?

ఇటీవల జరిగిన తెలంగాణ కేబినెట్ విస్తరణ సమయంలో టీఆర్ఎస్ నేతలకు పదవుల జాతర అంటూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. 12 మంది ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు, మరికొంతమందికి రాజ్యసభ సీట్లు, ఇంకొందరికి ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీ సీట్లు, మిగిలిన నేతలకు ఉన్నత పదవులు ఇస్తామని తెలిపారు. అయితే కేబినెట్ విస్తరణ తర్వాత అటు అసెంబ్లీ, ఇటు మండలిలో విప్, చీఫ్ విప్ పదవులు మినహా మరేవీ భర్తీ చేయలేదు.

ఆల్రెడీ పదవుల పందేరంపై క్లారిటీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మళ్లీ కొత్త డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చూపినవాళ్లకే పదవులు అంటూ ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు సమాచారం. దాంతో పదవులు లేని ఎమ్మెల్యేలకు ఇది అగ్ని పరీక్షగా మారింది.

ఓ వైపు ప్రతిపక్షాలు మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకున్నాయి. ఇటు సొంత పార్టీలో టికెట్ల పంచాయితీ సూచిస్తోంది. ఇలాంటి సమస్యలను అధిగమించి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయాలి. అప్పుడే ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇస్తామని గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. బయటకు ఈ విషయాన్ని చెప్పకున్నా అండర్ కరెంట్ కేటీఆర్ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. మొత్తానికి వచ్చే ఎన్నికల కోసం నేతలు ఇప్పటినుంచే ప్రిపరేషన్స్ మొదలు పెట్టారని తెలుస్తోంది.

Latest Articles
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
బాబీ డియోల్ డాన్స్ అచ్చు దించేసిన హీరోయిన్.. 32 ఏళ్ల క్రితమే...
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
దీపికతో పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిన రణ్‌వీర్ సింగ్.. కారణమిదేనా?
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం రోడ్డుపై బోల్తా.. ఒక్కసారిగా
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
రెండు చేతులూ లేకపోయినా.. బాధ్యతగా ఓటు వేసిన అంకిత్
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
మండే ఎండల్లో కూలింగ్ న్యూస్.. ఏపీకి వచ్చే 2 రోజులు వర్షాలు..
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా.? ఈ సమ్యలున్నాయో చెక్‌ చేసుకోండి
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
RRతో మ్యాచ్..టాస్ ఓడిన ఢిల్లీ.. జట్టులో టీమిండియా సీనియర్ ప్లేయర్
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
అమిత్ షా హామీతో మరింత దూకుడుగా అరవింద్!
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
డీబీటీతో రాజకీయం చేస్తున్నదెవరు? భూ ప్రకంపనలు వైసీపీని తాకాయా?
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!
ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే లక్షలు సంపాదించే అవకాశం.!