మొట్టమొదటి రాజకీయ పార్టీ… టిక్‌టాక్‌లో ఖాతా ఓపెన్ చేసేసింది..

సరదాగా వినోదం కోసం చూసుకునే టిక్‌టాక్ తొలిసారి రాజకీయాలకు వేదికగా మారింది. టిక్‌టాక్ చరిత్రలో ఫస్ట్‌టైమ్ మజ్లీస్ పార్టీ అఫీషియల్ ఖాతా తెరిచింది. ఈ విధంగా తెరిచిన మొట్టమొదటి పొలిటికల్ పార్టీగా ఎంఐఎం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు సోషల్‌మీడియా వేదికగా తమ వాయిస్ వినిపిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ఈ విషయంలో ముందున్నాయి. అయితే సోషల్‌మీడియాలో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాత్రమే పంచే టిక్‌టాక్ యాప్‌ను నూటికి 99 శాతం మంది సరదా వీడియోల కోసం మాత్రమే […]

మొట్టమొదటి రాజకీయ పార్టీ... టిక్‌టాక్‌లో ఖాతా ఓపెన్ చేసేసింది..
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 27, 2019 | 2:48 AM

సరదాగా వినోదం కోసం చూసుకునే టిక్‌టాక్ తొలిసారి రాజకీయాలకు వేదికగా మారింది. టిక్‌టాక్ చరిత్రలో ఫస్ట్‌టైమ్ మజ్లీస్ పార్టీ అఫీషియల్ ఖాతా తెరిచింది. ఈ విధంగా తెరిచిన మొట్టమొదటి పొలిటికల్ పార్టీగా ఎంఐఎం గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు సోషల్‌మీడియా వేదికగా తమ వాయిస్ వినిపిస్తున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లు ఈ విషయంలో ముందున్నాయి. అయితే సోషల్‌మీడియాలో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ను మాత్రమే పంచే టిక్‌టాక్ యాప్‌ను నూటికి 99 శాతం మంది సరదా వీడియోల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. కొంతమంది తమలో ఉన్న టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు.

సంప్రదాయ పద్దతులను పక్కనబెట్టి రాజకీయ నేతలు, వివిధ పార్టీలు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వాటితోనే ఎక్కువగా తమ కార్యకర్తలకు దగ్గరవుతున్నారు. హైదరాబాద్‌ పాతబస్తీలో ప్రారంభమైన ఎంఐఎం పార్టీ కూడా ట్విట్టర్‌ అఫీషియల్ ఖాతా ద్వారా సందేశాలను పోస్టుచేస్తూనే ఉంది. ఇప్పుడు టిక్‌టాక్ యాప్ ద్వారా మరింత మందికి పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు రెడీ అవుతోంది.

టిక్‌టాక్‌పై మంచి అభిప్రాయంతో పాటు చెడు అభిప్రాయం కూడా ఉంది. ఇది కత్తికి రెండు వైపులా పదును లాంటిదనే విషయం అనేక సందర్భాల్లో వెల్లడైంది. ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు, వ్యక్తిగత టాలెంట్‌లను అందరికీ తెలియజేసే సాధనంలా టిక్‌టాక్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. మరికొంతమంది లైకుల కోసం ఏకంగా ప్రాణాలమీదికి తెచ్చుకుంటూ, ఎన్నో సాహసాలు సైతం చేస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయ పార్టీల కోసం ఎక్కడో గానీ టిక్‌టాక్‌లో కనిపించదు. కానీ తాజాగా ఎంఐఎం మాత్రం అధికారిక ఖాతా తెరవడం ద్వారా ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో విస్తృత ప్రచారం వస్తుందని భావిస్తున్నటుగా అనిపిస్తుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu