AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫేస్‌బుక్‌లో కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు

న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచార ఖర్చు భారీగా పెరుగుతోంది. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కావడానికి ఇంకా పది రోజులు కూడా లేవు. ఈ దశలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు వాటి వాటి ప్రచారాల్లో మునిగిపోయాయి. ప్రచారానికి లెక్కలేనంత స్థాయిలో ఖర్చు చేస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ప్రచారానికి సంబంధించి అయితే భారీగా వెచ్చిస్తున్నాయి. సోషల్ మీడియాలో అందులోనూ ఫేస్‌బుక్‌లో అయితే పార్టీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ యాడ్‌ల లైబ్రరీలో […]

ఫేస్‌బుక్‌లో కోట్లు కుమ్మరిస్తున్న పార్టీలు
Vijay K
|

Updated on: Apr 03, 2019 | 1:32 PM

Share

న్యూఢిల్లీ: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచార ఖర్చు భారీగా పెరుగుతోంది. మొదటి దశ ఎన్నికలు ప్రారంభం కావడానికి ఇంకా పది రోజులు కూడా లేవు. ఈ దశలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలు వాటి వాటి ప్రచారాల్లో మునిగిపోయాయి. ప్రచారానికి లెక్కలేనంత స్థాయిలో ఖర్చు చేస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ప్రచారానికి సంబంధించి అయితే భారీగా వెచ్చిస్తున్నాయి. సోషల్ మీడియాలో అందులోనూ ఫేస్‌బుక్‌లో అయితే పార్టీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి.

సోషల్ నెట్‌వర్కింగ్ యాడ్‌ల లైబ్రరీలో ఉన్న సమాచారం ప్రకారం మార్చి 17 నుంచి మార్చి 23 వరకు ఒకటిన్నర్ర కోట్లను యాడ్ల రూపంలో పార్టీలు ఖర్చు చేశాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కలిపి పార్టీలు గడిచిన రెండు నెలల కంటే తక్కువ రోజుల్లోనే ప్రకటనల రూపంలో రూ. 8.3 కోట్లను ఖర్చు చేశాయి.

‘భారత్ కి మన్‌ కీ బాత్’ పేరుతో బీజేపీ పార్టీ విడుదల చేసిన యాడ్‌కు ఫేస్‌బుక్‌లో అన్నింటి కంటే ఎక్కువగా రూ. 2.2 కోట్లు ఖర్చు అయ్యింది. ‘నా మొదటి ఓటు బీజేపీకే’ అనే పేరుతో ఉన్న బీజేపీకి చెందిన ఒక పేజీ రూ. 61 లక్షలు ఖర్చు చేసి రెండో స్థానంలో ఉంది. మార్చి 17 నుంచి మార్చి 23 వరకు ఫేస్‌బుక్ ప్రకటనల కోసం కాంగ్రెస్ పార్టీ రూ. 5.40 లక్షలను ఖర్చు చేసింది. అదే ఫిబ్రవరి నుంచి అయితే కాంగ్రెస్ రూ. 7 లక్షలు ఖర్చు చేసింది.

సోషల్ మీడియాలో ప్రకనల ఖర్చు విషయంలో బీజేపీ కన్నా వెనకబడిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఖర్చును భారీగా పెంచుతుండటం గమనార్హం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇంకా పలు ప్రాంతీయ పార్టీలు కూడా తమతమ స్థాయిల్లో ఎన్నికల్లో గెలుపు కోసం సోషల్ మీడియా ప్రకటనలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి.

గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు..
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
'నీలాంటి స్నేహితుడు దొరకడం నా అదృష్టం'.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
21 ఏళ్ల క్రితం క్రిస్మస్‌కి సునామీ కడలిలో కలిసిన 10 వేల అభాగ్యలు
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
ఆఫీసులో ఒత్తిడి తగ్గించుకుని రాణించాలా? ఈ 7 పనులు చేయండి!
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ నుంచి లేడీ డాన్‌గా.. కట్ చేస్తే పోలీసుల..
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
చికెన్‌తో వెరైటీగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? ఇది ట్రై చేయండి!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!
హైదరాబాద్‌ సహా 48 నగరాల స్టేషన్‌లలో మారనున్న రూపురేఖలు!