జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీ భవిష్యత్తు: వర్మ

జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీ భవిష్యత్తు: వర్మ

హైదరాబాద్: ట్విట్టర్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీ భవిష్యత్తు అని అన్నారు. పెద్ద ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక విజ్ఞప్తి అంటూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. నిజమైన, నిజాయితీపరులైన అభిమానులంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే ఓటు వేయాలని కోరారు. టీడీపీకి నిజమైన వారసుడు నారా లోకేష్ కాదని, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీకి నిజమైన భవిష్యత్తు అని ఈ […]

Vijay K

|

Apr 03, 2019 | 12:07 PM

హైదరాబాద్: ట్విట్టర్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీ భవిష్యత్తు అని అన్నారు. పెద్ద ఎన్టీఆర్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక విజ్ఞప్తి అంటూ ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టారు. నిజమైన, నిజాయితీపరులైన అభిమానులంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు పాత్రను చూసిన తర్వాతే ఓటు వేయాలని కోరారు.

టీడీపీకి నిజమైన వారసుడు నారా లోకేష్ కాదని, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే టీడీపీకి నిజమైన భవిష్యత్తు అని ఈ సందర్భంగా వర్మ అన్నారు. టీడీపీకి నిజమైన నిజాయితీ భవిష్యత్తు కాగలవాడు జూనియర్ ఎన్టీఆర్ అని వర్మ అన్నారు.

వర్మ దర్శకత్వం వహించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా, ఏపీ మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన సంగతి తెలిసిందే.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu