‘నందమూరి బ్రదర్స్’ ఈ అంతర్మథనం ఎందులకు?

'నందమూరి బ్రదర్స్' ఈ అంతర్మథనం ఎందులకు?

ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం…తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, అన్న నందమూరి తారకరామారావు గారిచే స్థాపించబడిన పార్టీ. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ పగ్గాలు కాస్త ‘నారా’ వారి చేతికి వెళ్లాయి. పార్టీని ఆదరించడానికి, 9 నెలల్లో అధికారంలోకి రావడానికి అన్న ఎన్టీఆర్ కారణమైనా…ఇంత కాలం పార్టీ బలంగా నిలబడటానికి, నెగ్గుకురావడానికి చంద్రబాబు కారణమనేది పార్టీ కార్యకర్తల్లో బలంగా వినిపించే మాట. కానీ కొద్దిమంది కార్యకర్తల్లు మాత్రం పార్టీ ‘నారా’ వారి చేతుల్లోకి వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నారు. పగ్గాలు […]

Ram Naramaneni

|

Apr 03, 2019 | 2:45 PM

ఆంధ్రప్రదేశ్: తెలుగుదేశం…తెలుగు ప్రజల ఆరాధ్యదైవం, అన్న నందమూరి తారకరామారావు గారిచే స్థాపించబడిన పార్టీ. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ పగ్గాలు కాస్త ‘నారా’ వారి చేతికి వెళ్లాయి. పార్టీని ఆదరించడానికి, 9 నెలల్లో అధికారంలోకి రావడానికి అన్న ఎన్టీఆర్ కారణమైనా…ఇంత కాలం పార్టీ బలంగా నిలబడటానికి, నెగ్గుకురావడానికి చంద్రబాబు కారణమనేది పార్టీ కార్యకర్తల్లో బలంగా వినిపించే మాట.

కానీ కొద్దిమంది కార్యకర్తల్లు మాత్రం పార్టీ ‘నారా’ వారి చేతుల్లోకి వెళ్లడం జీర్ణించుకోలేకపోతున్నారు. పగ్గాలు ఎన్టీఆర్ ఫ్యామిలీ చేతుల్లోనే ఉండాలనేది వారి వాదన.  ఎలక్షన్స్ అప్పుడు, దివంగత ఎన్టీఆర్ జయంతి, వర్థంతి కార్యక్రామాల్లో  వారి యెక్క నిరసనను తెలపడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ గ్యాప్ కార్యకర్తల్లోనే ఉందా? ఫ్యామిలీల వరకు పాకిందా అంటే…కుటుంబాల మధ్య కూడా కాస్త గ్యాప్ నడుస్తుందనేది పొలిటికల్ వర్గాల భోగట్టా. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని టేక్ ఓవర్ చేసుకున్న సందర్భంలో హరికృష్ణకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తానని హామి ఇచ్చి..చంద్రబాబు దాన్ని విస్మరించారనేది హరికృష్ణ వర్గం నుంచి వచ్చే టాక్. ఆ తర్వాత ఆయనను పొలిట్ బ్యూరో సభ్యున్ని చేసినా, రాజ్యసభ సభ్యున్ని చేసినా ఆయన అసంతృప్తి చల్లారలేదనేది పార్టీలో ఇన్ సైడ్ వినిపించే మాట.  ఇక ఇదే విషయంపై హరికృష్ణ చాలా సార్లు బాహటంగానే తన అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ సమయంలోనే తన సోదరుడైన హీరో నందమూరి బాలకృష్ణతో కూడా గ్యాప్ మెయింటేన్ చేస్తూ వచ్చారు హరికృష్ణ.  తన ఇద్దరి కుమారులు, సినిమా హీరోలైన  నందమూరి తారక రామారావు, నందమూరి కళ్యాణ్ రామ్‌లను ఒక జట్టుగా ఉంచే ప్రయత్నం చేశారు. పలు వేడుకలకు, ఫంక్షన్స్‌కు తన కొడుకులతో  కలిసి వెళ్తూ..పార్టీ కార్యక్రమాల నుంచి కాస్త దూరం పాటించారు.

మళ్లీ విభేదాలు పక్కన పెట్టి 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జానియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్లీ గ్యాప్ వచ్చింది. హరికృష్ణ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కొడాలి నాని పార్టీ మారిన విషయంలో కావచ్చు, మరి కొన్ని వివాదాలు ముసురుకున్నప్పుడు కావచ్చు తాను ఆఖరి శ్వాస వరకు టీడీపీలో ఉంటా అని చెప్పిన ఎన్టీఆర్..పార్టీ వ్యవహారాల్లో, ప్రచార కార్యక్రమాల్లో మాత్రం అంటీ ముట్టనట్టు వ్యవరిస్తూ వస్తున్నారు. అయితే హరికృష్ణ మరణాంతరం విభేదాలు మళ్లీ సద్దుమణిగినట్టే కనిపించాయి.  హరికృష్ణ అంత్యక్రియల్లో కూడా చంద్రబాబు ఇంటి పెద్దగా వ్యవహరిస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాల్లో కుటుంబ సభ్యలందరూ ఒకే చోట కనిపించడంతో అభిమానులు, కార్యకర్తలు హ్యపీ ఫీల్ అయ్యారు.  సరిగ్గా ఇదే టైంలో తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. పొత్తుల్లో భాగంగా కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా  నందమూరి హరికృష్ణ కూతురైన సుహాసినిని బరిలోకి దించారు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు. ఇక అక్క కోసం నందమూరి బ్రదర్స్ ప్రచారం పక్కా అనుకున్నారు అందరూ. అయితే అనూహ్యంగా అక్కకు మా మద్ధతు అంటూ ఒక ప్రకటన రిలీజ్ చేసిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారంవైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.  దీంతో పార్టీ వర్గాల్లో చంద్రబాాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా తెలంగాణ పార్టీ భాధ్యతను జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమయంలో చంద్రబాబు పార్టీ ఎవరికి కావాలంటే వారు పార్టీలోనే ఉంటారని.. ఏ టైంలో ఏం చేయాలో నేను చూసుకుంటానంటూ చెప్పారు. బాలకృష్ణ కూడా పార్టీని కావాలనుకుంటే వారే ప్రచారానికి వస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో జానియర్ ఎన్టీఆర్‌కు, పార్టీకి గ్యాప్ అలానే ఉందా అనే టాక్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వినిపించింది.

అయితే మరో వారం రోజుల్లో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం ఇంకో ఆరు రోజుల్లో ముగియనుంది. ఈ టైం వరకు ప్రచారానికి ఇద్దరు నందమూరి హీరోలు అటెండ్ అవ్వలేదు. మరోవైపు వైసీపీలో రోజురోజుకూ సినీ గ్లామర్ యాడ్ అవుతూ పోతుంది. ఇప్పటికే రాజశేఖర్, మోహన్ బాబు, అలీ, జయసుధ లాంటి అగ్రస్థాయి నటులు ప్రచారంలో భాగమవుతున్నారు. తెలుగు తెర ఇలవేల్పు, అన్న ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి సినీ గ్లామర్ లేకపోవడం నిజంగా టీడీపీకి కాస్త ఇబ్బందికర విషయమే. జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రచారానికి పిలిచే విషయంలోనూ టీడీపీ అధినాయకత్వం ఆచి, తూచి పావులు కదుపుతుంది. ఇక ప్రచారంలో పాల్గొనే విషయంపై జూనియర్ కూడా ఆలోచనలో పడుతున్నారు. ఇక ఈ ఆఖరి వారం రోజుల్లో నందమూరి ‘బ్రదర్స్’ ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu