ఇవాళ్టితో ముగియనున్న తొలి దశ నామినేషన్ల పర్వం
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు తొలి దశ నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో ఇప్పటివరకు నామినేషన్ వేయని అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఇవాళ సమర్పించనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 17శాసనసభ స్థానాలకు ఇప్పటివరకు 220మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా మంగళవారం నుంచి అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. 28వ తేది మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా, అసంపూర్తిగా ఉన్న నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తారు. ఉపసంహరణ గడువు ముగిశాక పోటీలో […]
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు తొలి దశ నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో ఇప్పటివరకు నామినేషన్ వేయని అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఇవాళ సమర్పించనున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో మొత్తం 17శాసనసభ స్థానాలకు ఇప్పటివరకు 220మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా మంగళవారం నుంచి అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. 28వ తేది మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా, అసంపూర్తిగా ఉన్న నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తారు. ఉపసంహరణ గడువు ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు.