బెంగాల్‌లో ఎన్నికల ప్రచారానికి బ్రేక్!
పశ్చిమబెంగాల్‌లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీ రాత్రి 10 గంటల నుంచి బెంగాల్‌లోని తొమ్మిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఎన్నికల ప్రచారం సస్పెండ్ అయిన నియోజక వర్గాల్లో డుమ్‌డుమ్, బరసత్, జేనగర్, బసిరిహట్, మధురాపూర్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్ కోల్‌కతా ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారంనాడు జరిపిన రోడ్‌షో సందర్భెంగా టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య పెద్ద […]

పశ్చిమబెంగాల్‌లో హింసాకాండ చెలరేగిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 16వ తేదీ రాత్రి 10 గంటల నుంచి బెంగాల్‌లోని తొమ్మిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది.
ఎన్నికల ప్రచారం సస్పెండ్ అయిన నియోజక వర్గాల్లో డుమ్‌డుమ్, బరసత్, జేనగర్, బసిరిహట్, మధురాపూర్, జాదవ్‌పూర్, డైమండ్ హార్బర్, సౌత్, నార్త్ కోల్‌కతా ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మంగళవారంనాడు జరిపిన రోడ్‌షో సందర్భెంగా టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చేటుచేసుకున్న నేపథ్యంలో ఈసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.