రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో పురోగతి.. టెండర్లు పిలిచిన కేంద్రం.. తొలుత ఎక్కడి నుంచంటే?

రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి మరో అడుగు ముందుకేసింది కేంద్ర ప్రభుత్వం. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉత్తర భాగాన రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టెండర్లను ఆహ్వానించింది. RRR ఉత్తర భాగం ప్రతిపాదిత పొడవు 161.5 కి.మీ. ఇది నాలుగు-లేన్, యాక్సెస్-నియంత్రిత గ్రీన్‌ఫీల్డ్ ప్రాంతీయ ఎక్స్‌ప్రెస్‌వే. NHAI ఈ ప్రాజెక్ట్‌ను ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ మోడ్‌లో చేపట్టాలని నిర్ణయించింది.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో పురోగతి..  టెండర్లు పిలిచిన కేంద్రం.. తొలుత ఎక్కడి నుంచంటే?
Regional Ring Road Tenders
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 29, 2024 | 10:40 AM

తెలంగాణలో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సర్కార్‌ విజ్ఞప్తులకు కేంద్రం పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఈమేరకు నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ మార్గానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. నార్త్ పార్ట్‌కి టెండర్ల ప్రక్రియకు కేంద్రం టెండర్స్ పిలిచింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పురోగతి లభించింది. ఈ రీజినల్ రింగు రోడ్డు ప్రాజెక్టును ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మించాలని నిర్ణయించగా.. ప్రస్తుతం ఉత్తర భాగానికి కేంద్ర ప్రభుత్వం టెండర్స్ కాల్ ఫర్ చేసింది. నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ మార్గానికి కేంద్రం టెండర్స్ పిలిచింది. రీజినల్ రింగు రోడ్డు నార్త్ పార్టులో భాగంగా.. సంగారెడ్డిలోని గిమ్మాపూర్ నుంచి యాదాద్రి వరకు నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ మార్గం నిర్మాణానికి టెండర్స్ పిలిచింది.

మొత్తం 4 భాగాలుగా రోడ్డు నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ టెండర్లను పిలిచింది. 5వేల 555 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన పనులకు కేంద్రం టెండర్లను పిలిచింది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్న కేంద్రం.. రెండు సంవత్సరాల్లో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని నిబంధన కూడా పెట్టింది. డిసెంబర్ 27 నుంచే టెండర్ల ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది. టెండర్ల దాఖలుకు చివరి తేదీ ఫిబ్రవరి 14. ఇక అదేరోజు టెండర్లు తెరవనున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

2017 లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించింది అప్పటి ప్రభుత్వం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా అనేకసార్లు కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించారు. దీంతో కేంద్ర ట్రిపుల్ ఆర్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ముందుగా సంగారెడ్డి జిల్లా గిర్మ్‌పూర్ గ్రామం నుంచి రెడ్డిపల్లి గ్రామం వరకు 34.518 కిలోమీటర్లు.. రెడ్డిపల్లి గ్రామం నుండి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కిలోమీటర్లు.. ఇస్లాంపూర్ నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కిలోమీటర్లు.. ప్రజ్ఞాపూర్ నుంచి యాదాద్రి జిల్లా రాయగిరి వరకు 43 కిలోమీటర్లు.. మొత్తం 161.5 కిలోమీటర్ల పొడవు రోడ్డు నిర్మాణానికి కేంద్రం టెండర్లు పిలిచింది. ఇప్పటికే ఈ మార్గంలో తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ పనులు కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు టెండర్లకు కేంద్రం పిలుపివ్వటంతో.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడగు పడ్డట్టయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..