గులాబీ శ్రేణుల్లో కొత్త గుబులు..ఫరవాలేదంటున్న కెసీఆర్
ఆర్టీసీ సమ్మె గులాబీ పార్టీకి ప్లస్సా? మైనసా? ఈ ప్రశ్న ఇప్పుడు గులాబీ దళాన్ని కుదిపేస్తోంది. 49 వేల మంది కార్మికులు 52 రోజులుగా చేసిన సమ్మె టీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్‌లో ఇబ్బందిగా మారుతుందని, కార్మిక వర్గాల్లో కేసీఆర్ చరిష్మాకు ఓ మచ్చలా మారుతుందని కొంతమంది అంటుంటే….49 వేల మంది ముఖ్యం కాదు. నాలుగు కోట్ల ప్రజలు కోరుకున్నదే కేసీఆర్ చేశారని…ఇది ఆయన ఇమేజ్‌ను పెంచుతుందనేది మరికొంత మంది వాదన. నిరవధిక సమ్మె జరిగినా ప్రజల్లో ప్రభుత్వం […]
ఆర్టీసీ సమ్మె గులాబీ పార్టీకి ప్లస్సా? మైనసా? ఈ ప్రశ్న ఇప్పుడు గులాబీ దళాన్ని కుదిపేస్తోంది. 49 వేల మంది కార్మికులు 52 రోజులుగా చేసిన సమ్మె టీఆర్‌ఎస్ పార్టీకి భవిష్యత్‌లో ఇబ్బందిగా మారుతుందని, కార్మిక వర్గాల్లో కేసీఆర్ చరిష్మాకు ఓ మచ్చలా మారుతుందని కొంతమంది అంటుంటే….49 వేల మంది ముఖ్యం కాదు. నాలుగు కోట్ల ప్రజలు కోరుకున్నదే కేసీఆర్ చేశారని…ఇది ఆయన ఇమేజ్‌ను పెంచుతుందనేది మరికొంత మంది వాదన. నిరవధిక సమ్మె జరిగినా ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెద్దగా రాలేదని వారి భావన.
ఆర్టీసీలో కార్మికులు సమ్మె విరమించారు. విధులకు హాజరు అవుతామని చెప్పారు. అయితే ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. మీరు ఇష్టం వచ్చినపుడు సమ్మెకు పోయి….ఇష్టం వచ్చినపుడు ఉద్యోగంలో చేరతామని అంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేసింది. దీంతో విధుల్లో చేరేందుకు మంగళవారం ఉదయం వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పలు చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
52 రోజుల సమ్మెకు కార్మికులు పుల్ స్టాప్ పెట్టారు. కానీ ప్రభుత్వం మాత్రం దిగి రావడం లేదు. దీంతో ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఆర్టీసీ సమ్మెపై ఓ చర్చ నడుస్తోందట. కార్మికులు దిగివచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టు వీడకపోవం ఏంటి? అని కొందరు ప్రశ్నిస్తున్నారట. తెగే దాకా లాగితే పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని వీరంతా భయపడుతున్నారట.
ఆర్టీసీ కార్మికులు 49 వేల మంది. కుటుంబాల వారీగా చూస్తే 2 లక్షల మందికి పైగానే ఉంటారు. వీరి కుటుంబాల్లో ప్రభుత్వంపై ఒకసారి నెగటివ్ ఇంప్రెషన్ వస్తే…..పోవడం కష్టమని.. ఈవిషయం పార్టీ గుర్తించాలని టీఆర్‌ఎస్ నేతలు ప్రైవేటు సంభాషణల్లో అంటున్నారట.
కేసీఆర్ ఆర్టీసీ అంశాన్ని డీల్ చేసిన విధానం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మరికొంతమంది టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు. సమ్మెలతో ప్రజలు విసిగిపోయారని..దీనికి శాశ్వత పరిష్కారం కావాలని అనుకుంటున్నదే కేసీఆర్ చేసి చూపించారని…ఇది గులాబీ పార్టీకి ప్లస్సే తప్ప మైనస్ కాదనేది వీరి వాదన. 49 వేల మంది ఎంతో కొంత బాధపడ్డ…నాలుగు కోట్ల మంది ప్రజలు కేసీఆర్ వైపు ఉంటారని చెప్పుకొస్తున్నారు.
మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించలేదని టాక్ విన్పిస్తోంది. ఆ పార్టీ నేతలు ఎవరూ కార్మికులు మద్దతుగా దూకుడుగా వ్యవహరించలేదు. ఏదో మొక్కుబడిగా మొదట్ల సమ్మెలో పాల్గొన్నారు కానీ ముందుకు తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. ఇప్పటికూడా కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని వాడుకోవడంలో వెనుకబడ్డారు అనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట. మొత్తానికి ఆర్టీసీ సమ్మె వల్ల ఎవరికి లాభం జరిగింది? ఎవరు నష్టపోయారు? అని రాజకీయ పార్టీలు అంచనాల్లో మునిగిపోతున్నాయి.