AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ పార్కింగ్‌పై అధికారుల దృష్టి… కొత్త నిబంధనలు ఎలా ఉండబోతున్నాయో మీరే చదవండి

విశ్వనగరం దిశగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్ రూల్స్ విషయంలో పోలీసులు కఠినంగానే..

హైదరాబాద్‌ పార్కింగ్‌పై అధికారుల దృష్టి... కొత్త నిబంధనలు ఎలా ఉండబోతున్నాయో మీరే చదవండి
K Sammaiah
|

Updated on: Feb 26, 2021 | 5:13 PM

Share

విశ్వనగరం దిశగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహానగరంలో ట్రాఫిక్ రూల్స్ విషయంలో పోలీసులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా పార్కింగ్ విషయాలపై కూడా పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఇక పై కఠినంగా పార్కింగ్ నియమాలను అమలు చేయనున్నారు. అలాగే, కొత్త నిబంధనలను కూడా చేర్చారట. అయితే, పార్కింగ్ వాహనాల విషయంలో ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారన్న అపవాదు ఉండనే ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదని ఉత్తర్వులు గతంలోనే జారీ చేసినప్పటికీ ఈ దందా కొనసాగుతూనే ఉంది.

హైదరాబాద్ నగరంలో అడ్డగోలుగా పెరిగిపోయిన వాహనాల పార్కింగ్ దందాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరోమారు చర్యలకు ఉపక్రమించింది. ఎటువంటి పార్కింగ్ ఫీజులను వసూలు చేయరాదని మూడేళ్ల క్రితమే ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్ సర్కారు, తొలి రోజుల్లో పక్కాగానే అమలు చేసినా, క్రమంగా అదే దందా తిరిగి ప్రారంభమైంది. ఈ మధ్యలో కరోనా మహమ్మారి కట్టడి నిమిత్తం అమలు చేసిన లాక్ డౌన్ కూడా పార్కింగ్ దందా తిరిగి వేళ్లూనుకునేందుకు సహకరించింది. గడచిన నాలుగైదు నెలలుగా పార్కింగ్ ఫిర్యాదులు పెరగడంతో బల్దియా పరిధిలోని ఎన్ ఫోర్స్ మెంట్ం విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ (ఈవీడీఎం) విభాగం చర్యలు ప్రారంభించింది.

నగరంలోని మల్టిప్లెక్స్, మాల్స్, రెస్టారెంట్స్ వంటి వాటి వద్ద ఈ పార్కింగ్ ఫీజుల దందా అధికంగా జరుగుతోంది. కొత్త గా వచ్చిన నిబంధనల ప్రకారం 30 నిమిషాలకు పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. గంట పై వరకు ఉంచితే, సంబంధిత రెస్టారెంట్ లేదా మాల్ లోని బిల్ చూపితే ఎలాంటి పార్కింగ్ ఫీజును తీసుకోకూడదు. థియేటర్లో కూడా మూవీ టికెట్ ను చూపిస్తే పార్కింగ్ ఫీజు వసూలు చేయక్కర్లేదు. ఒకవేళ ఈ ధర పార్కింగ్ ఫీజు కంటే తక్కువ ఉంటె, అపుడు పార్కింగ్ ఫీజు వసూలు చేసుకోవచ్చు.

వాహనాల పార్కింగ్ నిబంధనలను వెలువరిస్తూ, అధిక ఫీజు వసూలు చేస్తే, ఆ ఆధారాన్ని ఫోటో తీసి ఆన్ లైన్ లో ఈవీడీఎం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ కు పంపాలని అధికారులు సూచించారు. ఇక నగరంలోని మాల్స్, మల్టీ ప్లెక్స్ లు, వాణిజ్య సంస్థలు, సినిమా హాల్స్ కు నేటి నుంచి పార్కింగ్ నిబంధనలతో కూడిన నోటీసులను అధికారులు పంపనున్నారు. తాజా నిబంధనల ప్రకారం, ఎక్కడైనా, ఎప్పుడైనా 30 నిమిషాల వరకు ఎలాంటి పార్కింగ్‌ ఫీజు వసూలు చేసేందుకు వీల్లేదు. ఆపై గంట వ్యవధిలో మాల్, వాణిజ్య ప్రదేశంలో ఏమైనా షాపింగ్ చేసినట్టు బిల్లు చూపించినా పార్కింగ్ చార్జీ ఉండదు. బిల్లు లేకుంటే మాత్రం నిర్ణీత పార్కింగ్‌ ఫీజు చెల్లించాలి వుంటుంది. ఇక గంటకన్నా ఎక్కువ సమయాన్ని పార్కింగ్ లో ఉంచిన వారు మూవీ టిక్కెట్ ‌ను చూపించాలి. ఈ ధర పార్కింగ్‌ ఫీజు కంటే ఎక్కువగా ఉంటే ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదు. ఒకవేళ నిర్ణీత పార్కింగ్‌ ఫీజు కంటే తక్కువగా ఉంటే మాత్రం ఫీజును చెల్లించాలని అధికారులు స్పష్టం చేశారు.

ఇక అన్ని వాణిజ్య సంస్థలు నిర్ణీత నమూనాలో పార్కింగ్‌ టిక్కెట్లను ముద్రించాలని, వాటిపై పార్కింగ్‌ నిర్వహిస్తున్న ఏజెన్సీ పేరు, చిరునామా, మొబైల్‌ నెంబర్‌ తప్పనిసరని అధికారులు తేల్చి చెప్పారు. పార్కింగ్‌ ఫీజు చెల్లించనవసరం లేని వారికి సైతం పార్కింగ్‌ టిక్కెట్‌ ఇవ్వాల్సిందేనని, అయితే దానిపై ఫీజు వసూలు చేస్తే ‘పెయిడ్’ అని, వసూలు చేయకుంటే ‘ఎగ్జెంప్టెడ్’ అన్న స్టాంపు తప్పనిసరని వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఈవీడీఎం నుంచి నోటీసు అందుకున్న 15 రోజుల్లోగా ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని, లేకుంటే రూ. 50 వేల జరిమానా కట్టాల్సి వుంటుందని అధికారులు హెచ్చరించారు.

Read more

నాటు సారా వ్యాపారంలో కొమరాడ తహశీల్దార్‌.. అక్రమ సంపాదన కోసం రెవెన్యూ అధికారి అడ్డదారి

Follow Us