AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాటు సారా వ్యాపారంలో కొమరాడ తహశీల్దార్‌.. అక్రమ సంపాదన కోసం రెవెన్యూ అధికారి అడ్డదారి

అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారి ఆయన. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్ది చక్కదిద్దాల్సిన స్థాయి ఆయనది. అలాంటి అధికారే పక్కదారి..

నాటు సారా వ్యాపారంలో కొమరాడ తహశీల్దార్‌.. అక్రమ సంపాదన కోసం రెవెన్యూ అధికారి అడ్డదారి
K Sammaiah
|

Updated on: Feb 26, 2021 | 3:35 PM

Share

అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారి ఆయన. ఎవరైనా తప్పు చేస్తే సరిదిద్ది చక్కదిద్దాల్సిన స్థాయి ఆయనది. అలాంటి అధికారే పక్కదారి పట్టాడు. అక్రమ సంపాదన కోసం అడ్డదారిలో నాటుసారా వ్యాపారానికి దిగాడు. గుట్టుగా సాగుతున్న ఆ దందాను విజయనగరం పోలీసులు బయటపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ లో అక్రమ మధ్యం ఏరులై పారుతున్నా.. నాటు సారా జోరు కూడా తగ్గడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మద్యం ఏరులై పారుతోంది. తెలంగాణ, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భారీగా అక్రమ మద్యం ఏపీకి చేరుతోంది. దీనికి తోడు నాటు సారా విక్రయాలు కూడా భారీగానే జరుగుతున్నాయి. స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో, పోలీసులు తనిఖీలు చేస్తున్నా సారా వ్యాపారాలు అస్సలు తగ్గడం లేదు. అయితే అధికారుల కారుల్లోనే నాటు సారా సరఫరా అవుతుండడం కలకలం రేపుతోంది.  కారుపై తహసీల్దారు స్టిక్కర్ ఉంటే పోలీసులు పట్టించుకోరు కాదా అనుకుని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ రివర్స్ అయ్యింది. అక్రమనాటు సారా తరలింపు గుట్టు రట్టు చేశారు పోలీసులు.

విజయనగరం జిల్లాలో కొమరాడ మండల తహశీల్దార్ కార్యాలయంలో అక్రమ నాటుసారా తరలింపు వ్యవహారం కలకలం రేపుతోంది..బలిజిపేట మండలం పెదపెంకి లో వాహనాల తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ పోలీసులు.. ఈ క్రమంలోనే కొమరాడ మండల తహశీల్దార్ కాకారులో తరలిస్తున్న రెండు వందల యాభై లీటర్ల నాటుసారాను పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు.. డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు ఎక్సైజ్ పోలీసులు.. అయితే తహసీల్దార్ కారులో ప్రయాణిస్తున్న నాటుసారా ఎక్కడ నుండి వస్తుంది? ఎవరు తరలిస్తున్నారు? ఎక్కడకు తరలిస్తున్నారు? ఈ అక్రమ సరఫరా లో తహశీల్దార్ పాత్ర పైన దర్యాప్తు చేస్తామంటున్నారు ఎక్సైజ్ పోలీసులు..

అయితే ఇటీవల జిల్లాలో నాటుసారా వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అడ్డుకోబోయే యత్నంలో కొన్నిసార్లు వాహనాలు తప్పించుకుపోయిన సందర్భాలనూ ఎదురుచూశారు. దాంతో ఇక లాభం లేదనుకున్న ఎక్సైజ్‌ పోలీసులు.. పెదపెంకిలో మఫ్టీలో కాపు కాశారు. ఆ క్రమంలో కొమరాడ ఎమ్మార్వో కారులో పెద్ద ఎత్తున నాటుసారాను తరలించడాన్ని గుర్తించి ఖంగుతిన్నారు. 250 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొమరాడ ఎమ్మార్వో ఆదేశాల మేరకే తాను ఈ పనిచేస్తున్నట్టు చెప్పినట్టుగా ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. తహశీల్దారుకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. నాటుసారా వ్యాపారంపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఎక్కడి దీన్ని తయారు చేస్తున్నారు. ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది.. ఎక్కడికి తరలిస్తున్నారు.. తహశీల్దార్‌ పాత్ర ఏంటన్నది తేల్చే పనిలో పడ్డారు ఎక్సైజ్‌ పోలీసులు.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ధరలను కూడా ఊహించని స్థాయిలో పెంచేసింది. మద్య నిషేదంలో భాగంగానే రేట్లు పెంచామని ప్రభుత్వం చెబుతోంది. రేట్లు భారీగా ఉంటే కొనేవారు తక్కువ అవుతారు కదా అన్నది ప్రభుత్వం వాదన. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద నిర్దేశించిన సమయాల్లోనే విక్రయాలు జరుగుతున్నాయి. అయితే దీనికితోడు ప్రభుత్వం విక్రయించే మద్యం షాపుల్లో మందుబాబులకు నచ్చిన బ్రాండ్లు దొరకడం లేదు. పేరులేని బ్రాండ్లు ఎక్కువగా ఉండడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యంవైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడంతో అటు వైపే ఆసక్తి కనపరుస్తున్నారు. అంతా డబ్బులు కూడా పెట్టలేని వారు నాటు సారాను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఒడిశా సరిహద్దు మండలాల నుంచి భారీగా నాటు సారా సరఫరా అవుతోంది.

ఇక తహశీల్దార్‌ అయి ఉండి ఇలా అడ్డదారిలో అక్రమాలకు పాల్పడున్నట్టు బయటపడడం.. జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Read more:

చంద్రబాబు బస చేసిన అర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌కు కరెంట్‌ కట్‌.. కాన్వాయ్‌ కారు బ్యాటరీతో నడిచిన జనరేటర్‌..