Nepal Political Crisis: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం.. ప్రధాని వైఖరిపై సొంత పార్టీలో తిరుగుబాటు.. విశ్వాస పరీక్షలో ప్రధాని ఓలీ ఓటమి

ఏడాది కాలంగా నేపాల్‌ ప్రభుత్వంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాస పరీక్షలో ఓటమిపాలయ్యారు.

Nepal Political Crisis: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం.. ప్రధాని వైఖరిపై సొంత పార్టీలో తిరుగుబాటు.. విశ్వాస పరీక్షలో ప్రధాని ఓలీ ఓటమి
Prime Minister Kp Sharma Oli Losing Trust Vote Plunges In Parliament
Follow us

|

Updated on: May 11, 2021 | 1:07 PM

Nepal Political Crisis: ఏడాది కాలంగా నేపాల్‌ ప్రభుత్వంలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాస పరీక్షలో ఓటమిపాలయ్యారు. పార్లమెంట్‌ దిగువసభలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా 93 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 124 వచ్చాయి. మొత్తం 271 మంది సభ్యులున్న దిగువ సభలో విశ్వాస పరీక్ష నెగ్గాలంటే 134 ఓట్లు తప్పనిసరి. అయితే, ప్రధానికి 93 ఓట్లే వచ్చాయి. అధికార పార్టీలోని 28 మంది సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరవ్వడం గమనార్హం.

ఓలీ ప్రభుత్వానికి పుష్పకుమార్‌ దహల్‌ అలియాస్‌ ‘ప్రచండ’ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ (మావోయిస్టు సెంటర్‌) మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ఆయన విశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి వచ్చింది. విశ్వాస తీర్మానం ఓడిపోవడంతో నేపాల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 (3) ప్రకారం ఓలీ పదవీచ్యుతుడైనట్లే. మరోవైపు, అధికార పీఠమే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేపాలీ కాంగ్రెస్‌, నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌ సెంటర్‌) కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

గత ఏడాది నుంచి నేపాల్ ప్రధాని కేపీ ఓలీ సొంత పార్టీలోనే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రభుత్వాన్ని ఏకపక్షంగా నడుపుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) విలీనమైన తర్వాత 2018లో కేపీ ఓలీని ప్రధానిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత పార్టీలో సంఘర్షణ మొదలైంది. రాజ్యాంగ పరిషత్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయకపోవడం విషయమై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రధాని కేపీ ఓలీ అధ్యక్షురాలు బిద్య దేవి భండారీకి సిఫార్సు చేశారు.

అనంతరం అధ్యక్షురాలు ఆర్డినెన్స్ జారీ చేశారు. దీంతో సొంత పార్టీలోనే వివాదం రాజుకుంది. పార్టీలోని సీనియర్ నాయకులు ఈ ఆర్డినెన్స్‌ను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని అధ్యక్షురాలిని ఎంపీలు అభ్యర్థించారు. ప్రధాని పదవి నుంచి, పార్టీ అధ్యక్ష పదవి నుంచి కేపీ ఓలీ దిగిపోవాలని కూడా డిమాండ్ చేశారు. ఓలీ సిఫారసు తర్వాత నేపాల్ పార్లమెంటులోని ప్రతినిధుల సభను డిసెంబర్ 20న నేపాల్ అధ్యక్షురాలు బిద్య దేవి భండారీ రద్దు చేశారు. మధ్యంతర ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తర్వాత ప్రచండ వర్గం మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో పార్లమెంట్‌లో ప్రధాని కేపీ శర్మ ఓలీ విశ్వాస పరీక్ష తప్పలేదు.

Read Also… Covid-19 Vaccination: కరోనా కల్లోలానికి వ్యాక్సి్న్‌తోనే కట్టడి.. టీకా తీసుకునేందుకు మొగ్గుచూపుతున్న యువత