శతృఘ్న సిన్హాకు షాకిచ్చిన బీజేపీ
న్యూఢిల్లీ : రెబల్ ఎంపీ శతృఘ్న సిన్హాకు.. అనుకున్నట్లే బీజేపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ, తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సిన్హాకు అధిష్ఠానం మొండిచేయి చూపించింది. ఈ సారి లోకసభ సీటు శతృఘ్న సిన్హాకు దక్కలేదు. పాట్నా సాహిద్ స్థానం నుంచి పోటీ చేసే శతృఘ్న సిన్హా స్థానాన్ని ఈసారి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటాయించారు. పాట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి సిన్హా రెండు సార్లు వరుసగా గెలుపొందారు. గత […]

న్యూఢిల్లీ : రెబల్ ఎంపీ శతృఘ్న సిన్హాకు.. అనుకున్నట్లే బీజేపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ, తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సిన్హాకు అధిష్ఠానం మొండిచేయి చూపించింది. ఈ సారి లోకసభ సీటు శతృఘ్న సిన్హాకు దక్కలేదు. పాట్నా సాహిద్ స్థానం నుంచి పోటీ చేసే శతృఘ్న సిన్హా స్థానాన్ని ఈసారి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కేటాయించారు. పాట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి సిన్హా రెండు సార్లు వరుసగా గెలుపొందారు. గత రెండేళ్లుగా విపక్షాలతో కలసి బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు సమస్యలు, నిరుద్యోగం, రాఫెల్ డీల్ తదితర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా, ఢిల్లీలలో విపక్షాలు నిర్వహించిన మెగా ర్యాలీల్లో సైతం సిన్హా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయనపై బీజేపీ అధిష్ఠానం కొరడా ఝుళిపించింది. అయితే శతృఘ్న సిన్హా.. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. సిన్హా కాంగ్రెస్ తీర్థం పుట్చుకుంటారని రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. బీహార్‌లోని 40 స్థానాలకు చెందిన జాబితాను ఇవాళ ఎన్డీఏ కూటమి రిలీజ్ చేసింది. ఆ జాబితాలో సీట్లు దక్కిన బీజేపీ నేతల్లో రాజీవ్ ప్రతాప్ రూడీ, గిరిరాజ్ సింగ్, రాధా మోహన్ సింగ్‌లు ఉన్నారు. పాట్నా సాహిబ్ నుంచి రవిశంకర్ ప్రసాద్, బెగుసరాయ్ నుంచి గిరిరాజ్ సింగ్, జాముయి నుంచి చిరాగ్ పాశ్వాన్, పాటలీపుత్ర నుంచి రామ్‌కిర్‌పాల్ యాదవ్, అర్రా నుంచి ఆర్కే సింగ్, బుక్సర్ నుంచి అస్వాని చౌబే, ఈస్ట్ చంపారన్ నుంచి రాధా మోహన్ సింగ్, సరన్ నుంచి రాజీవ్ ప్రతాప్ రూఢీ పోటీ చేయనున్నట్లు బీహార్ బీజేపీ ఇంచార్జ్ భూపేంద్ర యాదవ్ తెలిపారు.