కేసీఆర్‌ను ఏం చేస్తారు తమ్ముళ్లు?: చంద్రబాబు

కేసీఆర్‌ను ఏం చేస్తారు తమ్ముళ్లు?: చంద్రబాబు

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్, మోడీ, జగన్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్‌ను ఏం చేస్తారు తమ్ముళ్లు అని చంద్రబాబు ప్రజలను అడిగారు. కేసీఆర్ మీద ఎంత రోషంగా ఉంటారో చూస్తాను అని అన్నారు. ఏపీలో కేసీఆర్‌కు ఏం పని? ఇక్కడ మీ ఆటలు సాగవు కబడ్దార్ అని చంద్రబాబు హెచ్చరించారు. హైదరాబాద్ మన నగరం అని భావించి అన్ని విధాలా అభివృద్ధి చేశామని చంద్రబాబు అన్నారు. కాళ్లరిగేలా […]

Vijay K

|

Mar 23, 2019 | 1:57 PM

పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. పాలకొల్లులో ఆయన మాట్లాడుతూ కేసీఆర్, మోడీ, జగన్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్‌ను ఏం చేస్తారు తమ్ముళ్లు అని చంద్రబాబు ప్రజలను అడిగారు. కేసీఆర్ మీద ఎంత రోషంగా ఉంటారో చూస్తాను అని అన్నారు. ఏపీలో కేసీఆర్‌కు ఏం పని? ఇక్కడ మీ ఆటలు సాగవు కబడ్దార్ అని చంద్రబాబు హెచ్చరించారు. హైదరాబాద్ మన నగరం అని భావించి అన్ని విధాలా అభివృద్ధి చేశామని చంద్రబాబు అన్నారు.

కాళ్లరిగేలా తిరిగి అమెరికా నుంచి ఇక్కడకు మైక్రోసాఫ్ట్‌ను తీసుకొచ్చానని చంద్రబాబు అన్నారు. ఇన్ని చేస్తే ఆంధ్రావాళ్లను తరిమి కొట్టాలని, ఆస్తులన్నీ తమకే కావాలని అంటున్నారు. 60 ఏళ్లు కష్టపడిన తర్వాత ఉన్నపళంగా మీ ఆస్తులన్నీ లాక్కుంటే కోపం రాదా, జీవితాంతం బాధపడతారా లేదా అని అడుగుతున్నానని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోడీ విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేశారు. తెలంగాణలో డబుల్ బెడ్‌రూంలు ఎక్కడ ఉన్నాయని టీఆర్ఎస్‌ను చంద్రబాబు ప్రశ్నించారు.

ఇళ్లు కట్టిస్తా, మంచినీళ్లు ఇస్తా, పార్కులు, కరెంటు, మౌలిక సదుపాయాలు..అన్ని కల్పిస్తానని చంద్రబాబు పాలకొల్లు ప్రజలకు హామీ ఇచ్చారు. నేనే నెంబర్ వన్ కార్మికుడిని, నెంబర్ వన్ కూలీగా ఉంటా, ఉత్తమ నిర్వాహకుడిగా ఉంటా, పరిపాలన తెలిసిన వ్యక్తిని, ఏం చేస్తే ఆదాయం పెరుగుతుందో తెలిసిన వ్యక్తిని అని చంద్రబాబు అన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu